AP PGECET : ఏపీ పీజీఈసెట్ నోటిఫికేషన్ రిలీజ్

AP PGECET : ఏపీ పీజీఈసెట్ నోటిఫికేషన్ రిలీజ్
X

రాష్ట్రంలోని వర్సిటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి పలు పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీ పీజీఈసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 1 తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. దాదాపు 153 పీజీ కోర్సులకు సంబంధించి జూన్ 6 నుంచి 8 వరకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు https://cets.apsche.ap.gov.inలో సంప్రదించాలని అధికారులు సూచించారు. జూన్‌ 6 నుంచి 8 వరకు ప్రవేశ పరీక్షలు జరుగుతాయి. గేట్, జీపెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు ప్రత్యేక ప్రవేశాల నోటిఫికేషన్‌ జారీ చేస్తామని సెట్‌ కన్వీనర్‌ ఆచార్య పి.మల్లికార్జునరావు తెలిపారు.

ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంసీజే, మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్‌, ఎంఈడీ, ఎంపీఈడీ ఎమ్మెస్సీ టెక్నాల‌జీ వంటి కోర్సుల్లో ప్రవేశాల‌కు పీజీ కామ‌న్ ఎంట్రన్స్ ద్వారా ప్రవేశాలు క‌ల్పిస్తారు. అయితే సెట్‌లో వ‌చ్చిన ర్యాంక్ ఆధారంగా పీజీ కోర్సుల్లో ప్రవేశాలు క‌ల్పిస్తారు. దీనికి సంబంధించిన ప‌రీక్ష ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన నిర్వహ‌ణ బాధ్యత‌ల‌ను తిరుప‌తి శ్రీ వెంక‌టేశ్వర యూనివ‌ర్శిటీ (ఎస్‌వీయూ) చూస్తోంది. నోటీఫికేష‌న్ నుంచి ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌, ఫలితాలు వెల్లడి, కౌన్సిలింగ్ వంటి ప్ర‌క్రియ‌ల‌న్నీ ఎస్‌వీయూ నిర్వ‌హిస్తోంది. గ‌తేడాది ఏపీపీజీసెట్ నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ల‌ను ఆంధ్రా యూనివ‌ర్శిటీ చూసింది.

Tags

Next Story