AP Constable Final Results : ఏపీ పోలీసు కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదల

AP  Constable Final Results : ఏపీ పోలీసు కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదల
X

ఏపీ పోలీసు కానిస్టేబుల్ తుది రాత పరీక్ష ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత మరియు డీజీపీ కలిసి ఈ ఫలితాలను విడుదల చేశారు. డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఛైర్మన్‌ ఆర్‌.కె.మీనా పలువురు ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. గండి నానాజి 168 మార్కులతో ప్రథమ స్థానంలో, జి.రమ్య మాధురి (159) రెండో స్థానంలో, మెరుగు అచ్యుతారావు(144.5) మూడో స్థానంలో నిలిచారు. కాగా ఏపీ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (SLPRB) జూన్ 1, 2025న తుది రాత పరీక్ష నిర్వహించింది. మొత్తం 37,600 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాగా, వారిలో 33,921 మంది అర్హత సాధించారు. ఇందులో 29,211 మంది పురుషులు మరియు 4,710 మంది మహిళలు ఉన్నారు. అభ్యర్థులు తమ ఫలితాలను SLPRB యొక్క అధికారిక వెబ్‌సైట్ https://slprb.ap.gov.in/ లో చూసుకోవచ్చు. ఫలితాలను చూసుకోవడానికి అభ్యర్థులు తమ రోల్ నంబర్ మరియు పుట్టిన తేదీని నమోదు చేయాలి.

Tags

Next Story