AP: ప్రేమోన్మాది వెంకటేష్‌పై పోలీసుల కాల్పులు

AP: ప్రేమోన్మాది వెంకటేష్‌పై పోలీసుల కాల్పులు
X
పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడు

కడప జిల్లా ఖాజీపేటలో బాలిక హత్యకేసు నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు.. పోలీసుల నుంచి పారిపోతుండగా ఈ ఘటన జరిగింది. వెంకటేష్ అనే యువకుడు బాలిక ఇంటికి వెళ్లాడు.. తనను పెళ్లి చేసుకోవాలని ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. ఆమె అంగీకరించకపోవడంతో కత్తిత గొంతుకోసి పారిపోయాడు. బాధితురాలిని కడప రిమ్స్‌కు తరలిస్తుండగా.. దారిలోనే మృతి చెందింది. పోలీసులు నిందితుడు వెంటేషన్‌ను అరెస్ట్ చేయగా.. ఉదయం పారిపోయే ప్రయత్నం చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

అసలు ఏం జరిగిందంటే...

ఖాజీపేట మండలానికి చెందిన వెంకటేష్, అదే ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల యువతిని కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. పలుమార్లు పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయగా యువతి నిరాకరించింది. ఈ నేపథ్యంలో కక్ష పెంచుకున్న వెంకటేష్, శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఇంటికి వెళ్లి మరోసారి ఒత్తిడి చేశాడు. వాగ్వాదం చోటుచేసుకోగా, ఆగ్రహంతో తన వెంట తీసుకెళ్లిన కత్తితో యువతి గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన యువతి ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు వెంకటేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. శనివారం తెల్లవారుజామున అతడిని మైదుకూరు నుంచి వేరే ప్రాంతానికి తరలిస్తుండగా, తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఇద్దరు కానిస్టేబుళ్లపై దాడి చేసి గాయపరిచాడు. పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ముందుగా గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. అయినప్పటికీ అతడు ఆగకపోవడంతో చివరకు అతని కాళ్లపై కాల్పులు జరిపారు. గాయపడిన వెంకటేష్‌ను కడప రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. పోలీసులు కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story