AP: విశాఖ డ్రగ్స్ మాఫియాపై పోలీసుల నిఘా

AP: విశాఖ డ్రగ్స్ మాఫియాపై పోలీసుల నిఘా
X
డ్ర­గ్స్ దం­దా­పై తీవ్రంగా స్పందిస్తోన్న పో­లీ­స్ శాఖ

వి­శాఖ నగ­రం­లో గు­ట్టు­చ­ప్పు­డు కా­కుం­డా సా­గు­తు­న్న డ్ర­గ్స్ దం­దా­పై పో­లీ­స్ శాఖ తీ­వ్రం­గా స్పం­ది­స్తోం­ది. ము­ఖ్యం­గా యు­వ­త­ను లక్ష్యం­గా చే­సు­కు­ని పా­ఠ­శా­ల­లు, కళా­శా­లల సమీ­పా­ల్లో డ్ర­గ్స్ వి­క్ర­యం జరు­గు­తోం­ద­న్న సమా­చా­రం­తో సీపీ వి­రా­జ­శ­ను నే­తృ­త్వం­లో ప్ర­త్యేక చర్య­లు చే­ప­ట్టా­రు. మొదట తక్కువ ధరకే అం­దిం­చి, ఆపై మత్తు­లో­కి దిం­చు­తు­న్న ము­ఠా­లు, వి­ద్యా­ర్థు­ల­ను మా­న­సి­కం­గా బా­ని­స­లు­గా మా­ర్చే­స్తు­న్నా­యి. ఈ మత్తు­కు లో­నైన యువత పలు నే­రా­ల­కు పా­ల్ప­డి, చి­న్న వయ­సు­లో­నే నే­ర­స్తు­లు­గా మా­రు­తు­న్న ఘట­న­లు పె­రు­గు­తుం­డ­టం­తో, సీపీ నే­రాల అడ్డు­క­ట్ట­కు ప్ర­త్యేక దృ­ష్టి సా­రిం­చా­రు. వి­శా­ఖ­లో­ని ప్ర­తి మూలన నిఘా పెం­చి, అను­మా­ని­తు­ల­ను ప్ర­శ్ని­స్తు­న్నా­రు. పక్కా సమా­చా­రం­తో ఆక­స్మిక దా­డు­లు ని­ర్వ­హి­స్తు­న్నా­రు. ఇతర రా­ష్ట్రాల నుం­డి వి­శా­ఖ­లో­కి ప్ర­వే­శిం­చి డ్ర­గ్స్ వ్యా­పా­రం చే­స్తు­న్న ము­ఠా­ల­పై కూడా ప్ర­త్యేక దృ­ష్టి సా­రిం­చా­రు. డ్ర­గ్స్ మా­ఫి­యా ను కూ­క­టి వే­ళ్ల­తో తొ­ల­గిం­చేం­దు­కు, వి­ద్యా­ర్థు­ల­కు రక్షణ కల్పిం­చేం­దు­కు పో­లీ­సు­లు కట్టు­ది­ట్ట­మైన చర్య­లు తీ­సు­కుం­టు­న్నా­రు. యువత భవి­ష్య­త్తు­ను కా­పా­డేం­దు­కు సమా­జం మొ­త్తం గళ­మె­త్తా­ల్సిన అవ­స­రం ఉంది.

అంతర్ రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్‌ అరెస్ట్

అన్నమయ్య జిల్లా టీ.సుండుపల్లి మండలంలోని కావలిపల్లె అటవీ ప్రాంతంలో అక్రమంగా ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న సమాచారం మేరకు పోలీసులు ప్రత్యేక బృందాలతో సోదాలు నిర్వహించి అంతర్ రాష్ట్ర స్మగ్లర్ ఆండీ గోవిందన్‌ను అరెస్ట్‌ చేశారు. ఇతనిని 2025, జూలై 5న ఉదయం అరెస్ట్‌ చేసినట్లు జిల్లా అదనపు ఎస్పీ శ్రీ.యం.వెంకటాద్రి తెలిపారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన గోవిందన్ వద్ద నుంచి రూ.81,10,000 విలువైన 26 ఎర్రచందనం దుంగలు, ఒక కీప్యాడ్ సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. ఇతనిపై గతంలో ఉమ్మడి కడప జిల్లాలో నాలుగు ఎర్రచందనం కేసులు నమోదైనట్లు వెల్లడించారు. విచారణలో మరి కొంతమంది తమిళనాడు స్మగ్లర్లు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలిసిందని, వారిపై గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అటవీ సంపదను కాపాడటంలో ప్రజల భాగస్వామ్యం కీలకమని, సమాచారం ఇచ్చినవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు. ఈ అరెస్టులో కీలక పాత్ర పోషించిన డీఎస్పీ కృష్ణమోహన్, సీఐ వరప్రసాద్, ఎస్‌ఐ శ్రీనివాసులు, టాస్క్‌ఫోర్స్‌ అధికారులకు జిల్లా ఎస్పీ ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Tags

Next Story