AP: "పోలీసు విచారణకు ప్రసన్నకుమార్ రెడ్డి"

కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఓ మహిళ ఫిర్యాదుతో కోవూరు పోలీసులు మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసుల విచారణకు ప్రసన్న కుమార్ రెడ్డి హాజరయ్యారు. పోలీసులు ఆయన్ను మూడు గంటల పాటు విచారించారు. విచారణ అనంతరం ప్రసన్న కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తనను పోలీసులు 40 ప్రశ్నలు అడిగారని, అన్నిటికీ సమాధానం చెప్పానని ప్రసన్న కుమార్ రెడ్డి తెలిపారు. ‘రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. ఇలాంటి విషయాల్లో కేసులు పెడితె జైళ్లు, కోర్టులు సరిపోవు. కేసుకు సంబందించి పోలీసులు 40 ప్రశ్నలు అడిగారు. అందుకు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చాను. నా వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారు. నేను ఎక్కడా వ్యక్తిగతంగా మాట్లాలేదు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గురించి నేను మాట్లాడలేదు. నా మాటలను వక్రీకరించారు. బుచ్చిరెడ్డిపాళెం పర్యటనలో ప్రశాంతి రెడ్డే నాపై ఆరోపణలు చేశారు. స్టేజ్ మీద ఉన్న వారి మీద కూడా కేసులు పెట్టారు. నవ్వితే, చప్పట్లు కొడితే కేసులు పెట్టడం హాస్యాస్పదం. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి కేసులు పెడతాం అనేది మంచి సంప్రదాయం కాదు’ అని అన్నారు.
: వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి ఎవరూ దొరకనట్టు ఆమెను చేసుకున్నారని ఆయన కోరితే ఓ కన్నెపిల్లను తెచ్చి తానే పెళ్లి చేసేవాడినంటూ మాట్లాడారు. ‘పదేళ్ల కిందట నువ్వు ఎక్కడున్నావ్? ఆ ప్రభాకర్‌రెడ్డికి ఒకటే చెబుతున్నా నీ దగ్గర రూ.వేల కోట్ల ఆస్తులున్నాయ్. జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే నిన్ను చంపడానికి రెండు సిట్టింగ్‌లు అయ్యాయని నా దగ్గర సమాచారం ఉంది’ అంటూ మరికొన్ని మురికి వ్యాఖ్యలు చేశారు. ‘అతనో పిచ్చోడు. ఎందుకు ఈమెను పెళ్లి చేసుకున్నాడో తెలియదు. అతను అడిగి ఉంటే జిల్లాలో ముక్కుపచ్చలారని ఏ అమ్మాయినైనా అతనికిచ్చి పెళ్లి చేసేవాడిని’ అని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com