AP: విశాఖ సదస్సుకు ముమ్మరంగా ఏర్పాట్లు

విశాఖలో ఈ నెల 14, 15 తేదీలలో అత్యంత ప్రతిష్టాత్మకంగా పార్టనర్ షిప్ సమ్మిట్-2025 ని నిర్వహిస్తున్నారు. ఇది రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో కాదు, అంతర్జాతీయ స్థాయి సదస్సు. దాంతో దానికి అనుగుణంగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి. విశాఖలో జరిగే సమ్మిట్ కోసం గత రెండు నెలల నుంచి విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రహదారుల సుందరీకరణ నుంచి పార్కులు బీచ్ పరిసరాలు విహార స్థలాల అలంకరణ వరకూ అన్నీ సిద్ధం చేస్తున్నారు. ఏయూ ఇంజినీరింగ్ మైదానంలో 13 ఎకరాల్లో సదస్సుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడే దేశ, విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులు ప్రభుత్వంతో 410 ఒప్పందాలు చేసుకోనున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ మేరకు సుమారు రూ.9.80 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అదే సమయంలో రూ.2.70 లక్షల కోట్లతో చేపట్టనున్న ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపనలు చేయనున్నారు. సదస్సుకు ఈనెల 9వ తేదీలోగా పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తయ్యేలా చూస్తున్నారు. హాజరయ్యే ప్రతినిధులకు ఇచ్చిన గుర్తింపు కార్డులపై ప్రత్యేక క్యూఆర్ కోడ్ ఉంటుంది. దానినే సెక్యూరిటీ తనిఖీలకు ఉపయోగించనున్నారు.
ఈ అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు ద్వారా ఏకంగా 410 దాకా ఒప్పందలౌ వివిధ రంగాలలో పెట్టుబడుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకోనుందని చెబుతున్నారు. అంతే కాదు లక్షలలో పెట్టుబడులు కూడా వస్తాయని అంచనా వేస్తున్నారు. దేశ విదేశాల నుంచి ఏకంగా మూడు వేల మంది అతిథులు హాజరవుతారని అంటున్నారు. దాంతో ఈ భారీ సమ్మిట్ ని సక్సెస్ ఫుల్ గా చేయడానికి కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో శ్రమిస్తోంది. సమ్మిట్ లో 12 మల్టీ లాటరల్ ఆర్గనైజేషన్స్, 72మంది ఇంటర్నేషనల్ స్పీకర్స్ పాల్గొంటారు. 48 స్పీకింగ్ సెషన్స్ లో సెక్టార్లవారీగా వివిధ అంశాలపై విస్తృతంగా చర్చలు జరుపుతాం. ఈసారి పార్టనర్ షిప్ సమ్మిట్ లో 410 ఎంవోయూలపై సంతకం చేయబోతున్నాం. వీటిద్వారా రూ.9.8లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5లక్షల ఉద్యోగావకాశాలు రాబోతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

