AP Rains: నెల్లూరులో భారీ వర్షాలు..అర్ధాకలితో అలమటిస్తున్న కావలి దివ్యాంగులు..

X
By - Divya Reddy |30 Nov 2021 1:31 PM IST
AP Rains: ఎడతెరపి లేని వర్షాలతో నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని దివ్యాంగుల కాలనీలో పరిస్థితులు దయనీయంగా మారాయి.
AP Rains: ఎడతెరపి లేని వర్షాలతో నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని దివ్యాంగుల కాలనీలో పరిస్థితులు దయనీయంగా మారాయి. భారీగా వరఫు నీరు కాలనీలో నిలిచింది. అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో దివ్యాంగుల కాలనీ చెరువును తలపిస్తోంది. ఇళ్లలోకి కూడా వర్షపు నీరు రావడంతో దివ్యాంగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వర్షపు నీటితో పాటు ఇండ్లలోకి తేల్లు, పావులు ప్రవేశిస్తుండడంతో భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటున్నారు.
అధికారులు, అధికార పార్టీ నేతలు ఇటు వైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో సహాయక చర్యలు అందడం లేదు. అర్ధాకలితో అలమటిస్తున్నామని, బాహ్య ప్రపంచానికి దూరమయ్యామని దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com