AP: ఏపీలో విప్లవం.. అమరావతి క్వాంటమ్‌ వ్యాలీకి శ్రీకారం

AP: ఏపీలో విప్లవం.. అమరావతి క్వాంటమ్‌ వ్యాలీకి శ్రీకారం
X
అమరావతిలో చారిత్రాత్మక ఘట్టానికి ముందడుగు.. సాంకేతిక రంగాన్ని మలుపు తిప్పే చారిత్రక ఘట్టం.. అమరావతి క్వాంటమ్ వ్యాలీకి పునాదిరాయి.. క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మణానికి శంకుస్థాపన

దేశ సాం­కే­తిక భవి­ష్య­త్తు­ను కొ­త్త ది­శ­గా మలి­చే చా­రి­త్రక ఘట్టా­ని­కి ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌ రా­జ­ధా­ని అమ­రా­వ­తి వే­ది­కైం­ది. ప్ర­పంచ క్వాం­ట­మ్‌ టె­క్నా­ల­జీ రం­గం­లో రా­ష్ట్రా­న్ని అగ్ర­గా­మి­గా ని­ల­పా­ల­నే లక్ష్యం­తో ప్ర­భు­త్వం ప్ర­తి­ష్టా­త్మ­కం­గా చే­ప­ట్టిన ‘అమ­రా­వ­తి క్వాం­ట­మ్‌ వ్యా­లీ’ ప్రా­జె­క్టు ని­ర్మా­ణా­ని­కి శని­వా­రం శు­భా­రం­భం జరి­గిం­ది. తు­ళ్లూ­రు మం­డ­లం ఉద్దం­డ­రా­యు­ని­పా­లెం గ్రా­మం­లో ఈ కీలక ప్రా­జె­క్టు­కు ము­ఖ్య­మం­త్రి నారా చం­ద్ర­బా­బు నా­యు­డు శం­కు­స్థా­పన చే­శా­రు. కేం­ద్ర శా­స్త్ర, సాం­కే­తిక శాఖ మం­త్రి డా. జి­తేం­ద్ర సిం­గ్‌ ఈ కా­ర్య­క్ర­మా­ని­కి ము­ఖ్య అతి­థి­గా హా­జ­ర­య్యా­రు. ఈ ప్రా­జె­క్టు ద్వా­రా దే­శం­లో క్వాం­ట­మ్‌ వి­ప్ల­వా­ని­కి నా­య­క­త్వం వహిం­చే అవ­కా­శా­న్ని ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌ అం­ది­పు­చ్చు­కో­నుం­ద­ని ప్ర­భు­త్వం వి­శ్వ­సి­స్తోం­ది. అమ­రా­వ­తి­ని ప్ర­పంచ స్థా­యి క్వాం­ట­మ్‌ టె­క్నా­ల­జీ హబ్‌­గా తీ­ర్చి­ది­ద్దా­ల­నే సం­క­ల్పం­తో ఈ వ్యా­లీ­ని రూ­ప­క­ల్పన చే­శా­రు. ఇం­దు­కో­సం రా­ష్ట్ర ప్ర­భు­త్వం సు­మా­రు 50 ఎక­రాల భూ­మి­ని కే­టా­యిం­చ­గా, అత్యా­ధు­నిక సాం­కే­తిక సదు­పా­యా­ల­తో భవన ని­ర్మా­ణా­న్ని చే­ప­ట్ట­ను­న్నా­రు. ప్ర­ధా­నం­గా ఈ క్వాం­ట­మ్‌ వ్యా­లీ­లో క్వాం­ట­మ్‌ కం­ప్యూ­టిం­గ్‌, క్వాం­ట­మ్‌ కమ్యూ­ని­కే­ష­న్స్‌, క్వాం­ట­మ్‌ సె­న్స­ర్స్‌, కృ­త్రిమ మేధ (AI), సై­బ­ర్‌ సె­క్యూ­రి­టీ, రక్షణ రంగం, ఆరో­గ్య సే­వ­లు, ఫై­నా­న్స్‌ వంటి కీలక రం­గా­ల్లో పరి­శో­ధ­న­లు, ఆవి­ష్క­ర­ణ­లు జర­గ­ను­న్నా­యి. అం­తే­కా­కుం­డా యు­వ­త­కు అత్యు­న్నత స్థా­యి నై­పు­ణ్యా­భి­వృ­ద్ధి శి­క్ష­ణ­ను అం­దిం­చే­లా ప్ర­త్యేక కా­ర్య­క్ర­మా­లు రూ­పొం­దిం­చ­ను­న్నా­రు. ఈ ప్రా­జె­క్టు­లో భా­గం­గా భా­ర­త­దే­శ­పు తొలి 133 క్యూ­బి­ట్‌ క్వాం­ట­మ్‌ కం­ప్యూ­ట­ర్‌­ను అమ­రా­వ­తి­లో ఏర్పా­టు చే­య­డా­ని­కి చర్య­లు చే­ప­ట్టా­రు.

ఈ ది­శ­గా ఐబీ­ఎం, టీ­సీ­ఎ­స్‌, ఎల్‌­అం­డ్‌­టీ వంటి ప్ర­ముఖ అం­త­ర్జా­తీయ, జా­తీయ సం­స్థ­లు కీ­ల­కం­గా వ్య­వ­హ­రి­స్తు­న్నా­యి. క్వాం­ట­మ్‌ కం­ప్యూ­ట­ర్‌ స్థా­ప­న­తో పరి­శో­ధన రం­గం­లో వి­ప్ల­వా­త్మక మా­ర్పు­లు చోటు చే­సు­కుం­టా­య­ని ని­పు­ణు­లు అభి­ప్రా­య­ప­డు­తు­న్నా­రు. క్వాం­ట­మ్‌ వ్యా­లీ ఏర్పా­టు­తో ప్ర­పంచ స్థా­యి పరి­శో­ధ­నా కేం­ద్రా­లు అమ­రా­వ­తి వైపు ఆక­ర్షి­త­మ­వు­తా­య­ని, అం­త­ర్జా­తీయ టె­క్నా­ల­జీ సం­స్థ­లు భారీ పె­ట్టు­బ­డు­లు పె­ట్టే అవ­కా­శా­లు పె­రు­గు­తా­య­ని రా­ష్ట్ర ప్ర­భు­త్వం అం­చ­నా వే­స్తోం­ది. అలా­గే స్టా­ర్ట­ప్‌ ఎకో­సి­స్ట­మ్‌­కు ఇది పె­ద్ద ఊత­మి­చ్చే ప్రా­జె­క్టు­గా మా­ర­నుం­ది. వే­లా­ది కొ­త్త స్టా­ర్ట­ప్‌­లు, పరి­శో­ధ­నా సం­స్థ­లు ఏర్ప­డి, లక్ష­లా­ది మంది యు­వ­త­కు ఉపా­ధి అవ­కా­శా­లు లభిం­చ­ను­న్నా­యి.

ఈ ప్రా­జె­క్టు­ను ని­ర్ణీత గడు­వు­ల్లో పూ­ర్తి చే­యా­ల­నే లక్ష్యం­తో ప్ర­భు­త్వం ముం­దు­కు సా­గు­తోం­ది. ఆగ­స్టు నె­లా­ఖ­రు­కు క్వాం­ట­మ్‌ వ్యా­లీ భవన ని­ర్మా­ణా­న్ని పూ­ర్తి­చే­సి, డి­సెం­బ­రు నా­టి­కి క్వాం­ట­మ్‌ కం­ప్యూ­ట­ర్‌­ను ఏర్పా­టు చే­యా­ల­ని లక్ష్యం­గా పె­ట్టు­కుం­ది. ఇది కా­ర్య­రూ­పం దా­ల్చి­తే అమ­రా­వ­తి ప్ర­పంచ క్వాం­ట­మ్‌ మ్యా­ప్‌­పై ప్ర­త్యేక స్థా­నం సం­పా­దిం­చ­నుం­ది. ప్ర­స్తు­తం ప్ర­పం­చం­లో బో­స్ట­న్‌, సిం­గ­పూ­ర్‌, షాం­ఘై వంటి నగ­రా­లు క్వాం­ట­మ్‌ టె­క్నా­ల­జీ కేం­ద్రా­లు­గా గు­ర్తిం­పు పొం­దా­యి. వా­టి­తో సమా­నం­గా అమ­రా­వ­తి­ని ని­ల­పా­ల­న్న­దే ఈ ప్రా­జె­క్టు ప్ర­ధాన ఉద్దే­శ్యం. దీ­ర్ఘ­కా­లిక దృ­ష్టి­తో రూ­పొం­దిం­చిన ఈ క్వాం­ట­మ్‌ వ్యా­లీ, ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­కే కాదు, దే­శా­ని­కే గర్వ­కా­ర­ణం.

Tags

Next Story