AP: స్కూళ్లకు సెలవులు..విమానాలు, రైళ్లు రద్దు

AP: స్కూళ్లకు సెలవులు..విమానాలు, రైళ్లు రద్దు
X
67 రైళ్లు రద్దు చేసిన రైల్వే శాఖ.. విమానాలను రద్దు చేసిన సంస్థలు.. బయటకు రావద్దని సర్కార్ వార్నింగ్

మొథా తు­ఫా­ను ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో తీరం దా­టేం­దు­కు దూ­సు­కొ­స్తోం­ది. నేడు తు­ఫా­ను తీరం దా­టు­తుం­ద­ని వా­తా­వ­రణ శాఖ అం­చ­నా వే­సిం­ది. ఈ క్ర­మం­లో­నే వి­జ­య­వాడ, రా­జ­మం­డ్రి, కా­కి­నాడ, వి­శా­ఖ­ప­ట్ట­ణం, భీ­మ­వ­రం తది­తర మా­ర్గా­ల్లో ప్ర­యా­ణిం­చా­ల్సిన 67 రై­ళ్ల­ను భా­ర­తీయ రై­ల్వే రద్దు చే­సిం­ది. అక్టో­బ­ర్ 28, 29 తే­దీ­ల్లో ఈ రై­ళ్ల సే­వ­లు అం­దు­బా­టు­లో ఉం­డ­వ­ని ప్ర­క­టిం­చిం­ది. వా­తా­వ­ర­ణం మె­రు­గైన తర్వాత భద్ర­తా ప్ర­మా­ణా­లు బట్టి రైలు సే­వ­లు తి­రి­గి ప్రా­రం­భిం­చ­డం­పై ని­ర్ణ­యం తీ­సు­కుం­టా­మ­ని అధి­కా­రు­లు తె­లి­పా­రు. ఈ తు­ఫా­ను కా­ర­ణం­గా ఒడి­శా, ఆం­ధ్ర కా­రి­డా­ర్‌­లో పలు రైలు సే­వ­లు రద్ద­య్యా­యి. అలా­గే వి­మాన సే­వ­లు కూడా క్యా­న్సి­ల్ అయ్యా­యి. సో­మ­వా­రం నాడు వి­శా­ఖ­ప­ట్ట­ణా­ని­కి వె­ళ్లా­ల్సిన అన్ని ఇం­డి­గో, ఎయి­ర్ ఇం­డి­యా ఎక్స్‌­ప్రె­స్ వి­మా­నా­లు క్యా­న్సి­ల్ అయ్యా­యి. ఈస్ట్ కో­స్ట్ రై­ల్వే పరి­ధి­తో పాటు.. సౌ­త్‌ సెం­ట్ర­ల్‌ రై­ల్వే పరి­ధి­లో కూడా పలు రైలు సర్వీ­సు­ల­ను మూడు రో­జుల పాటు రద్దు చే­సిం­ది.. ఇక, మొం­థా తు­ఫా­న్‌ నే­ప­థ్యం­లో అప్ర­మ­త్త­మైన వి­మా­న­యాన శాఖ.. మొం­థా తు­ఫా­ను నే­ప­థ్యం­లో నేడు పలు వి­మా­నా­లు వి­జ­య­వాడ నుం­చి రద్దు చే­సి­న­ట్టు ప్ర­క­టిం­చా­రు. మొ­త్తం­గా మొం­థా తఫా­న్‌ నే­ప­థ్యం­లో.. వి­జ­య­వాడ నుం­చి పలు ప్రాం­తా­ల­కు వె­ళ్లా­ల్సిన.. వి­జ­య­వా­డ­కు రా­వా­ల్సిన వి­మాన సర్వీ­సు­ల­ను అన్ని రద్దు చే­సి­న­ట్టు .ఎయి­రిం­డి­యా ప్ర­క­టిం­చిం­ది.

సురక్షిత ప్రాంతాలకు..

తు­ఫా­ను నే­ప­థ్యం­లో లో­త­ట్టు ప్రాం­తా­ల్లో ని­వ­సిం­చే వా­రం­ద­ర్నీ సు­ర­క్షిత ప్రాం­తా­ల­కు ఆం­ధ్ర­ప్ర­దే­శ్ ప్ర­భు­త్వం తర­లిం­చిం­ది. ము­ఖ్యం­గా తూ­ర్పు, పశ్చిమ గో­దా­వ­రి జి­ల్లా­లు, కో­న­సీమ, వి­శా­ఖ­ప­ట్ట­ణం జి­ల్లా­ల్లో­ని చాలా లో­త­ట్టు ప్రాం­తాల ప్ర­జ­ల­ను సు­ర­క్షిత ప్రాం­తా­ల­కు తర­లిం­చ­డం జరి­గిం­ది. నే­ష­న­ల్ డి­జా­స్ట­ర్ రె­స్పా­న్స్ ఫో­ర్స్ (ఎన్డీ­ఆ­ర్ఎ­ఫ్), స్టే­ట్ డి­జా­స్ట­ర్ రె­స్పా­న్స్ ఫో­ర్స్ (ఎస్డీ­ఆ­ర్ఎ­ఫ్) రం­గం­లో­కి ది­గా­యి. అత్య­వ­సర షె­ల్ట­ర్లు ఏర్పా­టు చే­య­డం­తో­పా­టు నీరు, వి­ద్యు­త్ సప్ల­య్ దె­బ్బ­తి­న­కుం­డా చూ­డా­ల­ని అధి­కా­రు­ల­ను ప్ర­భు­త్వం ఆదే­శిం­చిం­ది. ప్ర­జ­లు ఇళ్ల­లో­నే ఉం­డా­ల­ని, తు­ఫా­ను సద్దు­మ­ణి­గే వరకూ భద్రత అడ్వ­యి­జ­రీ­ని పా­టిం­చా­ల­ని సూ­చిం­చిం­ది. మరో­వై­పు తు­పా­ను ప్ర­భా­వం ఉన్న జి­ల్లా­ల్లో­ని వి­ద్యా సం­స్థ­ల­కు సె­ల­వు­లు కొ­న­సా­గి­స్తు­న్న­ట్లు ప్ర­భు­త్వం వె­ల్ల­డిం­చిం­ది. ముం­పు ము­ప్పు ఉన్న ప్రాం­తా­ల్లో 2,194 పు­న­రా­వాస కేం­ద్రా­ల­ను ప్ర­భు­త్వం సి­ద్ధం చే­సిం­ది. కో­న­సీమ ప్రాం­తం­లో ఇప్ప­టి­కే ఈ శి­బి­రా­ల­కు తర­లిం­పు మొ­ద­లైం­ది. అన్ని జి­ల్లా­లో­ని కలె­క్ట­రే­ట్ల­లో­నూ, కం­ట్రో­ల్‌­రూం­లు ఏర్పా­టు చే­శా­రు.

Tags

Next Story