AP: ఏపీని వణికిస్తున్న స్క్రబ్ టైఫస్ కేసులు

AP: ఏపీని వణికిస్తున్న స్క్రబ్ టైఫస్ కేసులు
X
తెనాలిలో ఆరు స్క్రబ్‌ టైఫస్‌ కేసులు... అన్నమయ్య జిల్లాలో 39 మందికి పాజిటీవ్... కలవరపాటుకు గురవుతున్న ప్రజలు

ఆం­ధ్ర­ప్ర­దే­శ్ వ్యా­ప్తం­గా స్క్ర­బ్‌ టై­ఫ­స్‌ జ్వర కే­సు­లు పె­రు­గు­తు­న్నా­యి. గుం­టూ­రు జి­ల్లా­తో­పా­టు ఇతర జి­ల్లా­ల­కు చెం­దిన బా­ధి­తు­లు పె­ద్ద సం­ఖ్య­లో గుం­టూ­రు ప్ర­భు­త్వ సమ­గ్రా­స్ప­త్రి (జీ­జీ­హె­చ్‌)లో చి­కి­త్స పొం­దు­తు­న్నా­రు. ప్ర­స్తు­తం ఇక్కడ 22 మం­ది­కి చి­కి­త్స అం­ది­స్తు­న్నా­రు. వీ­రి­లో ము­గ్గు­రి ఆరో­గ్య పరి­స్థి­తి వి­ష­మం­గా ఉం­డ­టం­తో ఐసీ­యూ­లో ఉం­చా­రు. ఆసు­ప­త్రి బీ క్లా­స్‌ వి­భా­గం­లో 14 పడ­క­ల­తో స్క్ర­బ్‌ టై­ఫ­స్‌ రో­గుల కోసం ప్ర­త్యేక వా­ర్డు­ను ఏర్పా­టు చే­శా­రు. ప్ర­స్తు­తం ఈ వా­ర్డు మొ­త్తం రో­గు­ల­తో నిం­డి­పో­యిం­ది. ఇంకా మి­గి­లిన వా­రి­ని ఇతర వా­ర్డు­ల్లో ఉంచి పర్య­వే­క్షి­స్తు­న్నా­రు. చి­కి­త్సల కోసం వస్తు­న్న జ్వర బా­ధి­తు­లం­ద­రి­కీ స్క్ర­బ్‌ టై­ఫ­స్‌ ని­ర్ధా­రణ పరీ­క్ష­లు చే­యి­స్తు­న్న­ట్లు సూ­ప­రిం­టెం­డెం­ట్‌ డా­క్ట­ర్‌ రమణ యశ­స్వి తె­లి­పా­రు. అదే­వి­ధం­గా మలే­రి­యా, డెం­గీ పరీ­క్ష­లు కూడా చే­యి­స్తు­న్నా­మ­ని వె­ల్ల­డిం­చా­రు. జి­ల్లా­లో పలు చో­ట్ల పా­రి­శు­ధ్యం క్షీ­ణిం­చి.. స్క్ర­బ్‌ టై­ఫ­స్‌ కారక చి­గ్గ­ర్‌ మై­ట్స్‌ (పేడ పు­రు­గు­లు) సం­ఖ్య బాగా పె­రి­గి­న­ట్లు వై­ద్య వర్గా­లు అం­చ­నా వే­స్తు­న్నా­యి. పె­రి­గిన మై­ట్స్‌ వల్ల పలు­వు­రు ఈ జ్వ­రాల బా­రిన పడు­తు­న్నా­రు. ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో స్క్ర­బ్‌ టై­ఫ­స్‌ కే­సు­లు పె­రు­గు­తు­న్నా­యి. గుం­టూ­రు జి­ల్లా తె­నా­లి జి­ల్లా ప్ర­భు­త్వ వై­ద్య­శా­ల­లో ఆరు స్క్ర­బ్‌ టై­ఫ­స్‌ కే­సు­లు బయ­ట­ప­డ్డా­యి. వా­రం­ద­రి­కీ చి­కి­త్స అం­ది­స్తు­న్నా­మ­ని ఆస్ప­త్రి సూ­ప­రిం­టెం­డెం­ట్‌ డా­క్ట­ర్‌ సౌ­భా­గ్య­వా­ణి ఆది­వా­రం తె­లి­పా­రు. స్క్ర­బ్‌ టై­ఫ­స్‌ బా­ధి­తు­ల్లో నలు­గు­రు మహి­ళ­లు, ఇద్ద­రు పు­రు­షు­లు ఉన్నా­ర­ని చె­ప్పా­రు. రెం­డు రో­జుల క్రి­తం చి­కి­త్స పొం­దు­తు­న్న ఒకరి ఆరో­గ్యం మె­రు­గ­వ్వ­డం­తో డి­శ్చా­ర్జ్‌ చే­శా­మ­ని చె­ప్పా­రు.

అన్న­మ­య్య జి­ల్లా­లో స్క్ర­బ్‌ టై­ఫ­స్‌ వ్యా­ధి ఆం­దో­ళన కల్గి­స్తోం­ది. అన్న­మ­య్య జి­ల్లా పరి­ధి­లో ఇప్ప­టి­కి 289 నమూ­నా­ల­ను సే­క­రిం­చ­గా 39 మం­ది­కి పా­జి­టి­వ్‌ రా­వ­డం­తో జి­ల్లా ప్ర­జ­లు కల­వ­ర­పా­టు­కు గు­ర­వు­తు­న్నా­రు. రెం­డు రో­జుల కిం­దట సం­బే­ప­ల్లి మం­డ­లం, శె­ట్టి­ప­ల్లి గ్రా­మా­ని­కి చెం­దిన ఒక వి­ద్యా­ర్థి, కేవీ పల్లె మండల పరి­ధి­లో మరో వ్య­క్తి­కి వ్యా­ధి ని­ర్ధా­రణ కా­వ­డం­తో తి­రు­ప­తి­లో చి­కి­త్స పొం­దు­తు­న్న­ట్లు అధి­కా­రిక లె­క్క­లు చె­బు­తు­న్నా­యి. అన­ధి­కా­రి­కం­గా ఈ కే­సుల సం­ఖ్య అధి­కం­గా ఉన్న­ట్లు సమా­చా­రం. స్క్ర­బ్‌ టై­ఫ­స్‌ వ్యా­ధి పట్ల ఆం­దో­ళన చెం­దా­ల్సిన అవ­స­రం లే­దం­టూ­నే ని­ర్ల­క్ష్యం చే­స్తే ప్రా­ణా­పా­యం తప్ప­ద­ని వై­ద్య ని­పు­ణు­లు హె­చ్చ­రి­స్తు­న్నా­రు. వ్య­వ­సాయ పను­లు చే­సే­వా­రు జా­గ్ర­త్త­లు పా­టిం­చా­ల­ని చె­బు­తు­న్నా­రు. స్క్ర­బ్‌ టై­ఫ­స్‌ కే­సు­లు పె­రు­గు­తు­న్న క్ర­మం­లో ప్ర­జ­ల­తో­పా­టు జి­ల్లా వై­ద్య, ఆరో­గ్య శాఖ అప్ర­మ­త్తం­గా ఉం­డా­ల్సిన అవ­స­రం ఉంది.

అధి­క­శా­తం మం­ది­కి ఈ వ్యా­ధి­పై అవ­గా­హన లేదు. అధి­కా­రు­లు దీ­ని­పై వి­స్తృ­తం­గా కల్పిం­చా­ల్సిన అవ­స­రం ఉంది. ఇది సా­ధా­రణ జ్వ­రం లాం­టి­దై­న­ప్ప­టి­కీ ఆల­స్యం చే­స్తే శరీ­రం­లో అం­త­ర్గత అవ­య­వా­ల­పై ప్ర­భా­వం చూ­పి­స్తోం­ద­ని వై­ద్యు­లు చె­బు­తు­న్నా­రు. ప్ర­భు­త్వ ఆసు­ప­త్రు­ల్లో ప్ర­త్యేక వా­ర్డు­లు ఏర్పా­టు చే­యా­ల్సిన అవ­స­రం ఉంది. జి­ల్లా వ్యా­ప్తం­గా ప్ర­తి గ్రా­మం­లో ఈ వ్యా­ధి పట్ల అవ­గా­హన కా­ర్య­క్ర­మా­లు చే­ప­ట్ట­డం­తో­పా­టు మండల పరి­ధి­లో ల్యా­బ్‌­లు ఏర్పా­టు చే­స్తే బా­గుం­టుం­ద­ని ప్ర­జ­లు అభి­ప్రా­య­ప­డు­తు­న్నా­రు. .

ప్రైవేట్‌ ఆసుపత్రుల దోపిడీ.....

ఉమ్మ­డి జి­ల్లా వ్యా­ప్తం­గా అనేక ప్రై­వే­ట్‌ ఆసు­ప­త్రు­లు ఇదే అద­ను­గా భా­రీ­గా సొ­మ్ము చే­సు­కుం­టు­న్నా­య­నే ఆరో­ప­ణ­లు ఉన్నా­యి. కరో­నా సమ­యం­లో ఇలా­గే జరి­గిన వి­ష­యం తె­లి­సిం­దే. సా­ధా­రణ జ్వ­రా­న్ని స్క్ర­బ్‌ టై­ఫ­స్‌ అని భయాం­దో­ళ­న­కు గు­రి­చే­స్తూ పేదల నుం­చి డబ్బు దం­డు­కుం­టు­న్నా­ర­నే ఆరో­ప­ణ­లు వి­ని­పి­స్తు­న్నా­యి. దీ­ని­పై అధి­కా­రు­లు చర్య­లు తీ­సు­కో­వ­డం లే­ద­నే వి­మ­ర్శ­లు వ్య­క్త­మ­వు­తు­న్నా­యి. స్క్ర­బ్‌ టై­ఫ­స్‌ వ్యా­ధి­కి సం­బం­ధిం­చిన ల్యా­బ్, మం­దు­లు ప్ర­భు­త్వ ఆసు­ప­త్రి­లో అం­దు­బా­టు­లో ఉన్నా­య­ని, ప్ర­జ­లు సద్వి­ని­యో­గం చే­సు­కో­వా­ల­ని వై­ద్యు­లు సూ­చి­స్తు­న్నా­రు.

Tags

Next Story