AP: ఏపీ ప్రజలను వణికిస్తున్న స్క్రబ్ టైఫస్

AP: ఏపీ ప్రజలను వణికిస్తున్న స్క్రబ్ టైఫస్
X
వరుస మరణాలతో అప్రమత్తమైన ఏపీ సర్కార్... చంద్రబాబు కీలక ఆదేశాలు

ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో ‘స్క్ర­బ్‌ టై­ఫ­స్‌’ జ్వ­రా­లు కల­క­లం సృ­ష్టి­స్తు­న్నా­యి. దా­దా­పు అన్ని జి­ల్లా­ల్లో­నూ కే­సు­లు నమో­ద­వు­తు­న్నా­యి. ఆరో­గ్య­శాఖ లె­క్కల ప్ర­కా­రం రా­ష్ట్ర­వ్యా­ప్తం­గా 736 కే­సు­లు నమో­ద­య్యా­యి. కానీ అన­ధి­కా­రి­కం­గా వీటి సం­ఖ్య వే­ల­ల్లో ఉం­డొ­చ్చ­ని తె­లు­స్తోం­ది. బ్యా­క్టీ­రి­యా సో­కిన చి­గ్గ­ర్‌ మై­ట్‌ అనే నల్లి­ని పో­లిన చి­న్న కీ­ట­కం కు­ట్ట­డం ద్వా­రా వ్యా­పిం­చే ఈ ఇన్ఫె­క్ష­న్‌ జ్వ­రా­ల­కు ప్ర­ధా­న­కా­ర­ణ­మ­వు­తోం­ది. వర్షా­లు కు­రి­సే సమ­యం­లో దీని తీ­వ్రత అధి­కం­గా ఉం­టోం­ది. రా­ష్ట్రం­లో గత రెం­డు, మూ­డే­ళ్ల నుం­చి ఈ వ్యా­ధి­కి సం­బం­ధిం­చిన కే­సు­లు నమో­ద­వు­తు­న్నా తొ­లి­సా­రి­గా ఈ ఏడా­ది మూడు మర­ణా­లు నమో­ద­య్యా­యి. వి­జ­య­న­గ­రం జి­ల్లా­కు చెం­దిన ఓ మహి­ళ­తో పాటు పల్నా­డు జి­ల్లా­కు చెం­దిన ఇద్ద­రు మహి­ళ­లు వ్యా­ధి లక్ష­ణా­ల­తో మృ­తి­చెం­దా­రు. కం­గా­రు పడా­ల్సిన అవ­స­రం లే­ద­ని ప్ర­భు­త్వం, ఆరో­గ్య శాఖ చె­బు­తు­న్నా పరి­స్థి­తి ఆం­దో­ళ­న­క­రం­గా­నే ఉం­ద­ని వై­ద్యు­లు హె­చ్చ­రి­స్తు­న్నా­రు. రా­ష్ట్రం­లో 2023లో 579 కే­సు­లు నమో­దు కాగా, 2024లో 803 కే­సు­లు వె­లు­గు­లో­కి వచ్చా­యి. ఈ ఏడా­ది నవం­బ­రు 30 వరకూ 736 కే­సు­ల­ను ఆరో­గ్య­శాఖ గు­ర్తిం­చిం­ది.

వి­జ­య­న­గ­రం జి­ల్లా­లో ఈ వ్యా­ధి బా­రిన పడి రా­జే­శ్వ­రి అనే మహిళ మృ­తి­చెం­దం­తో ఆం­దో­ళ­న­లు నె­ల­కొ­న్నా­యి. ఈ నే­ప­థ్యం­లో ఏపీ సీఎం చం­ద్ర­బా­బు రం­గం­లో­కి ది­గా­రు. స్క్ర­బ్‌ టై­ఫ­స్‌ వ్యా­ధి­పై ప్ర­జ­ల్లో అవ­గా­హన కల్పిం­చిం­చేం­దు­కు చర్య­లు తీ­సు­కో­వా­ల­ని అధి­కా­రు­ల­కు ఆదే­శా­లు జారీ చే­శా­రు. స్క్ర­బ్ టై­ఫ­స్ తీ­వ్రత పె­ర­గ­క­ముం­దే.. ఈ వ్యా­ధి బా­రిన పడిన వా­రి­కి చి­కి­త్స అం­దిం­చా­ల­ని అధి­కా­రు­ల­కు ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు చె­ప్పా­రు. రా­ష్ట్రం­లో స్క్ర­బ్‌ టై­ఫ­స్‌ కే­సు­లు పె­రు­గు­తు­న్న నే­ప­థ్యం­లో.. కే­సుల నమో­దు­పై వై­ద్యా­రో­గ్య శాఖ కా­ర్య­ద­ర్శి సౌ­ర­భ్‌ గౌ­ర్‌­తోకీ­ట­కా­లు కు­ట్ట­డం వల్ల చని­పో­యే పరి­స్థి­తి రా­కుం­డా చర్య­లు తీ­సు­కో­వా­ల­ని సూ­చిం­చా­రు.

నల్ల మచ్చలతో గుర్తింపు

కీ­ల­కం కు­ట్టిన చోట నల్ల­టి మచ్చ లేదా దద్దు­ర్లు ఉంటే జ్వ­రం, తల­నొ­ప్పి­తో పాటు కం­డ­రాల నొ­ప్పు­లు ఉంటే స్క్ర­బ్‌ టై­ఫ్‌­స­గా అను­మా­నిం­చా­లి. ఈ పు­రు­గు కు­ట్టి­న­ప్పు­డు దాని లా­లా­జ­లం ద్వా­రా ఓరి­యాం­టి­యా సు­ట్సు­గ­ము­షి అనే బ్యా­క్టీ­రి­యా మని­షి రక్తం­లో­కి ప్ర­వే­శిం­చి ఇన్ఫె­క్ష­న్‌­కు కా­ర­ణ­మ­వు­తుం­ది. దట్ట­మైన చె­ట్లు, వ్య­వ­సాయ భూ­ముల పక్క­నే ని­వ­సిం­చే వా­రి­పై దీని ప్ర­భా­వం ఎక్కు­వ­గా ఉం­టుం­ది. అధి­కం­గా రా­త్రి సమ­యా­ల్లో ఈ పు­రు­గు­ల­ను మను­షు­ల­ను కు­డు­తుం­టా­యి. వ్యా­ధి ని­రో­ధక శక్తి తక్కు­వ­గా ఉన్న­వా­రి­కి, దీ­ర్ఘ­కా­లిక వ్యా­ధు­లు ఉన్న­వా­రి­పై దీని ప్ర­భా­వం ఎక్కు­వ­గా ఉం­టుం­ది.

Tags

Next Story