ఏపీలో పరిషత్ ఎన్నికలు.. ఎస్‌ఈసీ పిటిషన్‌పై ఇవాళ విచారణ

ఏపీలో పరిషత్ ఎన్నికలు.. ఎస్‌ఈసీ పిటిషన్‌పై ఇవాళ విచారణ
చట్టవిరుద్ధ ఎన్నికల్ని బహిష్కరించడం సరైనదేనన్న విషయం కోర్టు తీర్పుతో రుజువైందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.

ఎన్నికలు పెట్టాలంటే నాలుగు వారాల ముందే కోడ్‌ను అమలు చేయాలన్న రూలే లేదని వాదిస్తోంది ఎస్‌ఈసీ. కోడ్ ఉండాల్సిందే అన్నది సుప్రీంకోర్టు తీర్పులో ఉందే తప్ప చట్టబద్ధ నిబంధనే కాదంటూ కోర్టుకెళ్లింది. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలని కోరింది. ఎస్‌ఈసీ అప్పీల్‌పై ఈ ఉదయమే కోర్టులో విచారణ జరగనుంది.

పరిషత్‌ ఎన్నికలపై కోర్టులో విచారణ జరుగుతుండగానే నోటిఫికేషన్‌ ఎలా ఇస్తారంటూ ఎస్‌ఈసీని నీలం సాహ్నిని డైరెక్టుగానే ప్రశ్నించాయి ప్రతిపక్షాలు. పైగా నాలుగు వారాల ఎన్నికల కోడ్ ఉండి తీరాల్సిందేనని టీడీపీ కూడా వాదించింది. కాని, కోర్టులో ఉన్న పిటిషన్లేవీ ఎన్నికలను ఆపలేవంటూ నీలం సాహ్ని స్టేట్‌మెంట్ ఇచ్చారు. చివరికి ప్రతిపక్షాల వాదనే నిజమైంది. ఎస్‌ఈసీ వాదనలను కూడా విన్న రాష్ట్ర హైకోర్టు.. సుప్రీంకోర్టు గత తీర్పును అనుసరించి ఎన్నికలపై స్టే ఇచ్చింది.

చట్టవిరుద్ధ ఎన్నికల్ని బహిష్కరించడం సరైనదేనన్న విషయం కోర్టు తీర్పుతో రుజువైందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా పరిషత్ ఎన్నికలకు వెళ్లడాన్ని హైకోర్టు నిలుపదల చేయడం రాజ్యాంగ విజయం అని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ అరాచకానికి హైకోర్టు తీర్పు చెంపపెట్టు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.


Tags

Read MoreRead Less
Next Story