YS Sharmila : రేవంత్ లాగా ఏపీలో రుణమాఫీ చేయాలి : షర్మిల

పల్లవి, హైదరాబాద్: కాంగ్రెస్ సర్కారు అందించిన రైతు రుణమాఫీ వరం చరిత్ర గర్వించే రోజు అని ఏపీపీసీసీ చీఫ్ షర్మిల ( YS Sharmila ) అన్నారు. రైతుల కళ్ళల్లో ఆనందం తిరిగి తీసుకువచ్చే క్షణమని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) చేసిన విధంగా ఏపీలో రుణమాఫీ చేయాలని ఆమె ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. 15 ఏళ్ళ క్రితం ఒకే దఫాలో దేశవ్యాప్తంగా రుణమాఫీ చేసి అన్నదాత పట్ల ప్రేమ, వ్యవసాయం పట్ల నిబద్ధత చూపింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తు చేశారు. ఇది రాహుల్ గాంధీ ఎన్నికల వేళ చేసిన వాగ్దానం సాకారమైన రోజని, తెలంగాణ సర్కారుకు తను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కారును డిమాండ్ చేస్తున్నామన్న షర్మిల రైతుల తలసరి అప్పులో, దేశవ్యాప్తంగా మొదటి స్థానంలో ఉన్న ఏపీలో రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కూటమి సర్కారును అడుగుతున్నామని, రైతు రుణమాఫీ చేయాలని అన్ని విధాలుగా చితికిపోయిన ఏపీ రైతులకు చేయూత ఇవ్వాలని షర్మిల కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com