AP: ఏపీ లిక్కర్ కేసులో నేడు సిట్ చార్జిషీట్..?

ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇంతకాలం కేసు విచారణ ముమ్మరంగా చేసి సిట్ అధికారులు.. చార్జిషీట్‌ను రెడీ చేశారు. శనివారం ఉదయం ఏసీబీ కోర్టులో ఈ చార్జిషీట్‌ను దాఖలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కేసులో మొత్తం 11 మందిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. దాదాపు 220 మందిని విచారించారు. కీలక ఆధారాలను సేకరించారు. పలువురిని కస్టడీకి తీసుకుని వారి వాంగ్మూలాలను తీసుకున్నారు. ఈ మేరకు అధికారులు చార్జిషీట్ రెడీ చేశారు. కాగా గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో లిక్కర్ విక్రయాల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిట్ అధికారులు విచారించారు. పలువురు కీలక నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఇందులో పలువురు మాజీ అధికారులు ఉన్నారు. ఈ కేసులో మద్యంతర బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొందరు బెయిల్‌పై బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయనున్నారు. దీంతో నిందితుల్లో ఉత్కంఠ నెలకొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com