AP: ఆంధ్రప్రదేశ్‌లో స్లీపర్ బస్సులు రద్దు.. ?

AP: ఆంధ్రప్రదేశ్‌లో స్లీపర్ బస్సులు రద్దు.. ?
X
వరుస ప్రమాదాల వేళ కీలక నిర్ణయం... బస్సు ప్రమాదాలపై మంత్రుల సమీక్ష... ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై నిర్ణయం

ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో వరు­స­గా జరు­గు­తు­న్న బస్సు ప్ర­మా­దా­లు ప్ర­భు­త్వా­న్ని తీ­వ్ర ఆం­దో­ళ­న­కు గురి చే­స్తు­న్నా­యి. ము­ఖ్యం­గా స్లీ­ప­ర్ బస్సు­ల్లో జరి­గే ప్ర­మా­దా­లు ప్రా­ణ­న­ష్టా­ల­కు దా­రి­తీ­స్తుం­డ­టం­తో, అవ­స­ర­మై­తే భవి­ష్య­త్తు­లో వా­టి­ని పూ­ర్తి­గా రద్దు చేసే ది­శ­గా ప్ర­భు­త్వం ఆలో­చి­స్తు­న్న­ట్లు రా­ష్ట్ర రవా­ణా­శాఖ మం­త్రి మం­డి­ప­ల్లి రాం­ప్ర­సా­ద్ రె­డ్డి స్ప­ష్టం చే­శా­రు. ఇటీ­వల జరి­గిన ప్ర­మా­దాల నే­ప­థ్యం­లో ఏర్పా­టు­చే­సిన మం­త్రి­వ­ర్గ ఉప­సం­ఘం సమా­వే­శం­లో పలు కీలక ని­ర్ణ­యా­లు తీ­సు­కు­న్నా­రు. ఈ సమా­వే­శం­లో హోం­మం­త్రి వం­గ­ల­పూ­డి అని­త­తో పాటు ఉన్న­తా­ధి­కా­రు­లు పా­ల్గొ­ని, ప్ర­మా­దాల కా­ర­ణా­లు, ని­వా­రణ చర్య­లు, రహ­దా­రి భద్ర­త­పై సమ­గ్రం­గా చర్చిం­చా­రు. సమా­వే­శం అనం­త­రం మీ­డి­యా­తో మా­ట్లా­డిన మం­త్రి రాం­ప్ర­సా­ద్ రె­డ్డి, ప్ర­భు­త్వ లక్ష్యం ఒకటే — రో­డ్డు ప్ర­మా­దా­ల­ను పూ­ర్తి­గా తగ్గిం­చ­డం, ప్ర­జల ప్రా­ణా­ల­ను కా­పా­డ­టం అని తె­లి­పా­రు. ఇం­దు­కో­సం ఎలాం­టి కఠిన చర్య­లు తీ­సు­కో­వ­డా­ని­కై­నా ప్ర­భు­త్వం వె­ను­కా­డ­ద­ని ఆయన స్ప­ష్టం చే­శా­రు. ఇటీ­వల కర్నూ­లు, మా­రే­డు­మి­ల్లి, మా­ర్కా­పు­రం ప్రాం­తా­ల్లో జరి­గిన బస్సు ప్ర­మా­దా­ల­పై పరి­శీ­లన జరి­పి­తే, అవి ప్ర­ధా­నం­గా మానవ తప్పి­దాల వల్లే జరి­గి­న­ట్లు తే­లిం­ద­ని తె­లి­పా­రు. డ్రై­వ­ర్ల ని­ర్ల­క్ష్యం, అలసట, వేగ ని­యం­త్రణ లోపం వంటి అం­శా­లు ఈ ప్ర­మా­దా­ల­కు కా­ర­ణ­మ­య్యా­య­ని అధి­కా­రు­లు గు­ర్తిం­చా­రు.

ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థపై కఠిన నిఘా పెట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే 16 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి, వాహనాల తనిఖీలను వేగవంతం చేశారు. గత పది రోజుల వ్యవధిలోనే దాదాపు 10 వేల వాహనాలను తనిఖీ చేసినట్లు మంత్రి వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చట్టాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడే వారిపై “ఉక్కుపాదం” మోపుతామని స్పష్టం చేశారు.

ప్రై­వే­ట్ ట్రా­వె­ల్స్ బస్సుల వి­ష­యం­లో ప్ర­భు­త్వం ప్ర­త్యే­కం­గా దృ­ష్టి పె­ట్టిం­ది. ము­ఖ్యం­గా 300 కి­లో­మీ­ట­ర్ల­కు పైగా ప్ర­యా­ణిం­చే బస్సు­ల్లో ఇద్ద­రు డ్రై­వ­ర్లు తప్ప­ని­స­రి­గా ఉం­డా­ల­ని ఆదే­శిం­చా­రు. డ్రై­వ­ర్ అలసట ని­వా­రిం­చ­డా­ని­కి ఇది అత్యంత అవ­స­ర­మ­ని అధి­కా­రు­లు భా­వి­స్తు­న్నా­రు. రా­త్రి ప్ర­యా­ణాల సమ­యం­లో ఒక డ్రై­వ­ర్ వి­శ్రాం­తి తీ­సు­కు­నేం­దు­కు ప్ర­త్యేక సీటు కే­టా­యిం­చా­ల­ని కూడా సూ­చిం­చా­రు. అలా­గే బస్సు­లో డ్రై­వ­ర్ కా­ర్య­క­లా­పా­లు, ఎదు­రు­గా వచ్చే వా­హ­నాల కద­లి­క­ల­ను పర్య­వే­క్షిం­చేం­దు­కు రెం­డు సీసీ కె­మె­రా­లు ఏర్పా­టు చే­యా­ల­ని ప్రై­వే­ట్ యా­జ­మా­న్యా­ల­కు సూ­చిం­చా­రు. ఇక బస్సుల వేగ ని­యం­త్ర­ణ­పై కూడా ప్ర­భు­త్వం కఠిన ని­ర్ణ­యా­లు తీ­సు­కుం­ది. ప్ర­యా­ణిం­చే దూ­రా­న్ని బట్టి గమ్య­స్థా­నా­ని­కి చే­రా­ల్సిన సమ­యా­న్ని ని­ర్దే­శి­స్తా­మ­ని, ఆ సమ­యా­ని­కి ముం­దు­గా­నే చేరే బస్సు­ల­ను నగ­రం­లో­కి అను­మ­తిం­చ­బో­మ­ని మం­త్రి తె­లి­పా­రు. ఇది వేగం తగ్గిం­చ­డా­ని­కి కీ­ల­కం­గా ఉప­యో­గ­ప­డు­తుం­ద­ని అధి­కా­రు­లు భా­వి­స్తు­న్నా­రు. అద­నం­గా, రా­ష్ట్రం­లో­ని జా­తీయ మరి­యు రా­ష్ట్ర రహ­దా­రు­ల­పై స్పీ­డ్ గన్‌­లు ఏర్పా­టు చే­య­డా­ని­కి ఇప్ప­టి­కే రూ.40 కో­ట్ల ని­ధు­లు కే­టా­యిం­చి­న­ట్లు వె­ల్ల­డిం­చా­రు.

Tags

Next Story