AP SSC Result 2022: విడుదలయిన ఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాలు.. 4.14 లక్షల మంది పాస్..

X
AP SSC Result 2022: ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు వచ్చేశాయి. బాలికలే పైచేయి సాధించారు. ప్రకాశం జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా.. అనంతపురం జిల్లా చివరి స్థానంలో నిలిచిందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. 6లక్షల 15వేల మంది పరీక్షలకు హాజరయ్యారని అన్నారు. 4లక్షల 14వేల మంది పాస్ అయినట్లు వెల్లడించారు. మొత్తం 67.26 శాతం ఉత్తీర్ణత నమోదైందన్నారు. మొదటిసారిగా విద్యార్థుల మార్కులను ప్రకటించారు. వచ్చే నెల 6 నుంచి 15వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. దీనికి రేపటి నుంచే ఫీజు కట్టొచ్చని తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
