AP: మంగళగిరిలో టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభం

AP: మంగళగిరిలో టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభం
X
పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహానికి వేదికగా "హబ్".. టాటా.. భారత జాతి ముద్దు బిడ్డ: చంద్రబాబు... టాటా ఆలోచనలకు అనుగుణంగానే ఇన్నోవేషన్ హబ్

ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో రతన్ టాటా ఇన్నో­వే­ష­న్ హబ్‌­కు నాం­ది పలి­కిం­ది. మం­గ­ళ­గి­రి మయూ­రి టెక్ పా­ర్క్ ప్రాం­గ­ణం­లో సీఎం చం­ద్ర­బా­బు, మం­త్రి నారా లో­కే­శ్ లాం­ఛ­నం­గా ఈ హబ్‌­ను ప్రా­రం­భిం­చా­రు. 50 వేల చద­ర­పు అడు­గుల వి­స్తీ­ర్ణం­లో ని­ర్మి­త­మ­వు­తు­న్న ఈ హబ్‌ భవి­ష్య­త్ అవ­స­రా­ల­ను దృ­ష్టి­లో ఉం­చు­కు­ని స్టా­ర్ట­ప్‌­ల­కు కొ­త్త ది­శ­గా ని­ల­వ­నుం­ద­ని అధి­కా­రు­లు వె­ల్ల­డిం­చా­రు. అమ­రా­వ­తి­ని కేం­ద్రం­గా తీ­సు­కు­ని రూ­పు­ది­ద్దు­కుం­టు­న్న ఈ హబ్ డీ­ప్‌­టె­క్, కృ­త్రిమ మేధ, సు­స్థిర ఆవి­ష్క­ర­ణ­లు, సమ్మి­ళిత టె­క్నా­ల­జీ­ల­కు వే­దిక కా­నుం­ది. అమ­రా­వ­తి­ని “క్వాం­ట­మ్ వ్యా­లీ”గా మా­ర్చే ది­శ­గా ప్ర­భు­త్వం ప్ర­త్యేక ప్ర­ణా­ళి­క­లు రూ­పొం­దిం­చిం­ది. ప్ర­పం­చ­స్థా­యి ప్ర­తి­భ­ను ఆక­ర్షిం­చ­డం, పె­ట్టు­బ­డు­లు రప్పిం­చ­డం, ఆవి­ష్క­రణ ఆధా­రిత ఆర్థిక వ్య­వ­స్థ­ను బలో­పే­తం చే­య­డ­మే దీని ప్ర­ధాన లక్ష్యం. రత­న్‌ టాటా భరత జాతి ము­ద్దు­బి­డ్డ అని ఏపీ సీఎం చం­ద్ర­బా­బు కొ­ని­యా­డా­రు. రత­న్‌­టా­టా ఇన్నో­వే­ష­న్‌ హబ్‌­ను సీఎం చం­ద్ర­బా­బు, మం­త్రి లో­కే­శ్‌ ప్రా­రం­భిం­చా­రు. అనం­త­రం చం­ద్ర­బా­బు ప్ర­సం­గిం­చా­రు. ‘దే­శా­ని­కి ఏదై­నా చే­యా­ల­ని రత­న్‌­టా­టా తపిం­చే­వా­రు. సమా­జ­సే­వ­కు ఆయన జీ­వి­తాం­తం కృషి చే­శా­రు. ప్ర­తి­ఒ­క్క­రూ డబ్బు సం­పా­దిం­చా­ల­నే చూ­స్తా­రు. ఆయన మా­త్రం సం­పా­దిం­చిన డబ్బు­ను సమా­జా­ని­కి తి­రి­గి­చ్చే­వా­రు. రత­న్‌­టా­టా ఆలో­చ­న­లు సజీ­వం­గా ఉం­చా­ల­ని ఇన్నో­వే­ష­న్‌ హబ్‌ ప్రా­రం­భి­స్తు­న్నాం. ప్ర­తి కు­టుం­బం నుం­చి ఎం­ట్ర­ప్రె­న్యూ­ర్‌ రా­వా­ల­నే­దే నా ని­నా­దం. గతం­లో ప్ర­తి ఇంటి నుం­చి ఒక ఐటీ ఉద్యో­గి ఉం­డా­ల­ని కృషి చే­శా­ను. భవి­ష్య­త్‌ అంతా ఐటీ రం­గా­ని­దే అని గు­ర్తిం­చా­ను. సరైన ప్ర­భు­త్వ వి­ధా­నా­లు అవ­లం­బి­స్తే ఆదా­యం, సంపద వస్తుం­ది’’ అని చం­ద్ర­బా­బు అన్నా­రు.

టాటాకు అంకితం: నారా లోకేశ్‌

వి­నూ­త్న ఆలో­చ­న­ల­తో ముం­దు­కొ­చ్చే పా­రి­శ్రా­మి­క­వే­త్త­ల­కు పా­ర­ద­ర్శ­కం­గా ప్రో­త్సా­హ­కా­లు కల్పిం­చేం­దు­కు రతన్ టాటా ఇన్నో­వే­ష­న్ హబ్ కీలక వే­దిక కా­నుం­ద­ని మం­త్రి నారా లో­కే­శ్‌ అన్నా­రు. ఆలో­చ­న­ల­కు తగ్గ ఫలి­తాల సా­ధ­నే లక్ష్యం­గా ఈ వే­దిక పని చే­స్తుం­ద­న్నా­రు. ఇం­దు­క­ను­గు­ణం­గా వి­ద్యా వ్య­వ­స్థ పు­నా­దు­లు బలో­పే­తం చేసి వి­ద్యా­ర్థి దశ నుం­చే ప్రో­త్స­హి­స్తు­న్నా­మ­ని వె­ల్ల­డిం­చా­రు. ముం­దు­న్న సవా­ళ్ల­కు తగ్గ­ట్టు­గా­నే అవ­కా­శా­ల­ను అం­ది­పు­చ్చు­కు­నే కా­ర్యా­చ­ర­ణ­తో పని­చే­స్తు­న్న­ట్లు చె­ప్పా­రు. డబు­ల్ ఇం­జి­న్ సర్కా­ర్ పని చే­స్తు­న్నం­దున దే­శా­ని­కి ఏపీ ఆవి­ష్క­ర­ణల హబ్‌­గా అభి­వృ­ద్ధి చెం­దా­ల­ని ఆకాం­క్షి­స్తు­న్నా­మ­న్నా­రు.

Tags

Next Story