దేవినేని ఉమ అరెస్ట్‌..

దేవినేని ఉమ అరెస్ట్‌..
X

Devineni Uma

Devineni Uma Arrest: అర్ధరాత్రి దాటాక బలవంతంగా అదుపులో తీసుకున్న పోలీసులు

Devineni Uma Arrest: తనపై దాడి చేసిన వైసీపీ నేతలను అరెస్ట్‌ చేయాలంటూ.... తన ఫిర్యాదును తీసుకోవాలంటూ... దేవినేని ఉమా జీ.కొంండూరు పోలీస్‌స్టేషన్‌ వద్దకు ఆందోళనకు దిగారు. ఫిర్యాదు తీసుకునే దాక తాను కదిలేది లేదంటుూ కారులోనే కూర్చున్నారు. కానీ ఆయన ఫిర్యాదు తీసుకోలేదు పోలీసులు. అయితే.. అర్ధరాత్రి తర్వాత ఆయన్ను బలవంతంగా అదుపులో తీసుకున్నారు. కారు అద్దాలు పగులగొట్టి డోరు తెరిచి అదుపులో తీసుకున్నారు. అక్కడ నుంచి పెదపారుపూడి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దాదాపు ఆరు గంటల పాటు కారులోనే ఉమ ఆందోళన చేశారు. పోలీసుల తీరుపై మండిపడ్డారు టీడీపీ నేతలు. ఫిర్యాదు తీసుకోకుండా... అదుపులో తీసుకోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేవినేని ఉమా వాహనంపై వైసీపీ వర్గీయులు మంగళవారం రాళ్లదాడికి దిగారు. కొండపల్లి అటవీప్రాంతంలో అక్రమమైనింగ్‌ చేస్తున్నారనే ఆరోపణలపై దేవినేని ఉమా పరిశీలనకు వెళ్లారు. తిరిగి వస్తుండగా ఉమా కారును జి.కొండూరు మండలం గడ్డమణుగ గ్రామం వద్ద వైసీపీ వర్గీయులు అడ్డుకున్నారు. వాహనం చుట్టుముట్టి దాడికి దిగారు. వైసీపీ నేతలను అరెస్ట్‌ చేయాలంటూ...ఫిర్యాదును తీసుకోవాలంటూ.. దేవినేని ఉమా జీ.కొంండూరు పోలీస్‌స్టేషన్‌ వద్దకు ఆందోళనకు దిగారు.

Tags

Next Story