నిమ్మాడలో అచ్చెన్నాయుడు అరెస్ట్‌!

నిమ్మాడలో అచ్చెన్నాయుడు అరెస్ట్‌!
ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడును శ్రీకాకుళం జిల్లాలో పోలీసులు అరెస్టు చేశారు. వైసీపీ సర్పంచ్‌ అభ్యర్థి అప్పన్నను అచ్చెన్నాయుడు బెదిరించారంటూ ఆరోపణలు వచ్చాయి.

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడును శ్రీకాకుళం జిల్లాలో పోలీసులు అరెస్టు చేశారు. వైసీపీ సర్పంచ్‌ అభ్యర్థి అప్పన్నను అచ్చెన్నాయుడు బెదిరించారంటూ ఆరోపణలు వచ్చాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు... అచ్చెన్నాయుడు అరెస్టు చేశారు. ఆయన్ను కోట బొమ్మాలి పీఎస్‌కు తరలించారు..

మరోవైపు అచ్చెన్నాయుడు అరెస్టుపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ జగన్ రెడ్డి కక్ష సాధింపునకు పరాకాష్ట అన్న చంద్రబాబు.. ఉత్తరాంధ్రపై జగన్ కక్ష కట్టారని మండిపడ్డారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలలో భయోత్పాతం సృష్టిస్తున్నారని... నిమ్మాడలో గత 40ఏళ్లలో ఏనాడూ ఇలాంటి ఉద్రిక్తతలు లేవని చంద్రబాబు అన్నారు. దాడికి వెళ్లిన వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్‌పై కేసు పెట్టకుండా అచ్చెన్నాయుడుపై కేసులు పెట్టడమేంటని మండిపడ్డారు.

అటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ సైతం ప్రభుత్వ వైఖరిపై నిప్పులు చెరిగారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ రాజారెడ్డి రాజ్యాంగానికి పరాకాష్ట అన్న లోకేష్‌. పంచాయతీ ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతోనే జగన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పిరికిపంద చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

Tags

Read MoreRead Less
Next Story