AP: పదో తరగతి పరీక్ష వాయిదా

AP: పదో తరగతి పరీక్ష వాయిదా
X

ఏపీలో పదో తరగతి పరీక్ష వాయిదా పడింది. రంజాన్ పండగ నేపథ్యంలో సాంఘిక పరీక్షను వాయిదా వేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 31న పదవ తరగతి సాంఘిక శాస్త్రం పరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. ఆరోజును రంజాన్ సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో 31న జరగాల్సిన సోషల్ ఎగ్జామ్ ను పోస్ట్ పోన్ చేశారు. ఈ పరీక్షను ఏప్రిల్ 1న నిర్వహించనున్నట్టు ప్రకటించారు. పరీక్ష తేదీని అన్ని విభాగాలకు తెలియజేయాలని వీడియో కాన్ఫరెన్సులో ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు శ్రీనివాసులరెడ్డి అధికారులకు సూచించారు. శుక్రవారం జరిగిన జీవశాస్త్రం పరీక్షలో చిత్తూరు జిల్లాలో చూచిరాతకు పాల్పడిన ఒక విద్యార్థిని డిబార్‌ చేయగా.. ఇన్విజిలేటర్‌ను సస్పెండ్‌ చేశామని పేర్కొన్నారు. ఈ పరీక్షకు 6,36,241 మంది విద్యార్థులకు గాను 6,27,673(98.65%) మంది హాజరయ్యారని చెప్పారు.

పది పరీక్షా పత్రాల మూల్యాంకనం 3 నుంచి

ఏప్రిల్‌ 3 నుంచి 9 వరకు పదో తరగతి, 3 నుంచి 7 వరకు సార్వత్రిక విద్యాపీఠం పది, ఇంటర్మీడియట్‌ పరీక్షా పత్రాల మూల్యాంకనం నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లా కేంద్రాల్లో మూల్యాంకన కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. సహాయ ఎగ్జామినర్స్‌ ప్రతి రోజు 40 జవాబు పత్రాలను దిద్దాల్సి ఉంటుంది. మూల్యాంకనం చేసిన పత్రాల పునఃపరిశీలనలో మార్కులు తేడాలు వస్తే సంబంధిత అధికారులపై క్రమశిక్షణ చర్యలతోపాటు జరిమానా విధిస్తారు.

Tags

Next Story