AP: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ఉగ్ర లింకులు

ఏపీలో ఉగ్రవాదులు కలకలం రేగింది. సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఇద్దరు ఉగ్రవాద సానుభూతిపరులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి సింగిల్ బ్యారెల్ రైఫిల్‌తో పాటు 10 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సజ్జద్ హుస్సేన్, మహారాష్ట్రకు చెందిన తౌఫిక్ అలాం షేక్ గా గుర్తించారు. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో వీరికి సంబంధాలు ఉన్నట్లు తేలింది. కాగా ఇటీవలకాలం ధర్మవరంలో నూర్ మహ్మద్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం లోతుగా విచారించారు. దీంతో ధర్మవరంలో మరో ఇద్దరు ఉన్నట్లు నూర్ మహ్మాద్ తెలిపారు. ఈ సమాచారం ఆధారంగా ఈ రోజు ధర్మవరంలో ఇద్దరు ఉగ్రవాద సానుభూతి పరులను అరెస్ట్ చేశారు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ ISI తో సంబంధమున్న ఉత్తర్ ప్రదేశ్ నివాసి సాజాద్ హుస్సైన్ , మహారాష్ట్ర నివాసి తౌఫీక్ ఆలం షేక్ లను అరెస్టు చేసినట్లు సత్య సాయి జిల్లా యస్.పి. సతీష్ కుమార్ తెలిపారు. కోత్వాల్ నూర్ మొహమ్మద్ ధర్మవరంలో నివసిస్తూ పాకిస్తాన్-ఐ ఎస్ ఐ ఆధారిత జైష్-ఎ-మొహమ్మద్‌కు చెందిన పలువురు వాట్సాప్ గ్రూప్‌లలో సభ్యుడిగా ఉండేవాడని తెలిపారు. భారత భూభాగంలో ఉగ్రవాద కార్యకలాపాల నిర్వహణకు పాల్పడ్డడాని తెలిపారు.
గతంలోనూ..
ఆంధ్రప్రదేశ్‌లో ఉగ్రవాదుల కదలికలు కలకలం రేపాయి. ఓ మంత్రిగారి నియోజకవర్గంలోనే ఇద్దరు ఉగ్రవాదులను ఐబీ అధికారులు అరెస్ట్ చేయడంతో సంచలనంగా మారింది. రాయచోటిలో అబూబకర్, మహమ్మద్ అలీ అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి ఇళ్లలో సోదాలు చేసి పుస్తకాలు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అసలు వీళ్లెవరు? ఎన్నాళ్లుగా ఇక్కడ ఉన్నారు? వీరి లక్ష్యం ఏమిటి? అనే ప్రశ్నలు ప్రజల్లో మొదలయ్యాయి. ఈ అరెస్టులు స్థానికంగా భయాందోళనలు కలిగిస్తున్నాయి. తమిళనాడుకు చెందిన అబూబకర్ సిద్ధిఖీ, మొహమ్మద్ అలీలు కొన్నేళ్లుగా రాయచోటిలో నివాసం ఉంటున్నారు. వీరిద్దరు ఇక్కడే పెళ్లిళ్లు చేసుకుని స్థానికులుగా ఉండిపోయారు. వీరిద్దరు చిన్న, చిన్న వ్యాపారాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరిద్దరు గత 30 ఏళ్లుగా తప్పించుకుని తిరుగుతున్నట్లు తెలుస్తోంది. అబూబకర్ రాయచోటిలోని కొత్తపల్లె ఉర్దూ స్కూల్ ఎదురుగా అమానుల్లా పేరుతో షాపు నిర్వహిస్తున్నాడు. మహబూబ్ బాషా వీధిలో సొంత ఇల్లు ఉంది.. చీరల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. వీరిద్దరు కొన్ని నెలలపాటూ రాయచోటిలో ఉండకుండా వెళ్లిపోతారని.. ఎక్కడికి వెళ్లాని అడిగితే వ్యాపారం కోసం బయటకు వెళ్లినట్లు స్థానికులతో చెప్పేవారని తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com