AP: దశాబ్దాలుగా రాయచోటిలోనే ఉగ్రవాదులు

AP: దశాబ్దాలుగా రాయచోటిలోనే ఉగ్రవాదులు
X
పట్టుకోకపోతే పెను విధ్వంసమే జరిగేదన్న పోలీసులు... 30 ఏళ్లుగా దుస్తులు అమ్ముతూ ఉగ్ర దాడులకు ప్లాన్

అన్న­మ­య్య జి­ల్లా రా­య­చో­టి­లో ఉగ్ర­వాద కద­లి­క­లు తీ­వ్ర కల­క­లం రే­పు­తు­న్నా­యి. ఈ ప్రాం­తం­లో ఉగ్ర­మూ­కల కద­లి­క­ల­ను గు­ర్తిం­చిన తమి­ళ­నా­డు యాం­టీ టె­ర్ర­రి­జం స్క్వా­డ్‌ ఇటీ­వల ఇద్ద­రు ఉగ్ర­వా­దు­ల­ను అరె­స్ట్‌ చే­సిం­ది. వా­రి­ని అదు­పు­లో­కి తీ­సు­కు­న్న తర్వాత నిం­ది­తుల ఇళ్ల­లో తమి­ళ­నా­డు పో­లీ­సు­లు సో­దా­లు ని­ర్వ­హిం­చా­రు. పో­లీ­సుల సో­దా­ల్లో కీలక వి­ష­యా­లు వె­లు­గు­లో­కి వచ్చా­యి. నిం­ది­తుల ని­వా­సా­ల్లో భారీ పే­లు­ళ్ల­కు ఉప­యో­గిం­చే..పే­లు­డు పదా­ర్థా­లు, డి­టో­నే­ట­ర్లు, వా­కీ­టా­కీ­లు, పే­లు­డు­కు వాడే వై­ర్లు లభ్య­మై­న­ట్లు తె­లు­స్తుం­ది. పట్టు­బ­డిన ఇద్ద­రు ఉగ్ర­వా­దు­ల­లో ఒకరు అబూ­బ­క­ర్ సి­ద్ది­క్‌, మహ­మ్మ­ద్ అలీ­గా తమి­ళ­నా­డు పో­లీ­సు­లు గు­ర్తిం­చా­రు. అయి­తే వీరు తమి­ళ­నా­డు­లో మారు పే­ర్ల­తో తి­రు­గు­తు­న్న­ట్టు పో­లీ­సు­లు గు­ర్తిం­చా­రు. అక్కడ అబూ­బ­క­ర్ సి­ద్ది­క్ తన పే­రు­ను అలి­యా­స్ నా­గూ­ర్‌­గా, మహ­మ్మ­ద్ అలీ తన పే­రు­ను మే­ళ­ప­ల­యం­గా చె­ప్పు­కొ­ని తి­రు­గు­తు­న్న­ట్టు పో­లీ­సు­లు పసి­గ­ట్టా­రు. రా­య­చో­టి­లో­ని కొ­త్త­ప­ల్లి ప్రాం­తం­లో ని­వ­సి­స్తూ చీరల వ్యా­పా­రం­తో పాటు చి­న్న కి­రా­ణా దు­కా­ణం నడు­పు­తు­న్నా­రు. అబూ­బ­క­ర్‌­ను స్థా­ని­కు­లు "కేరళ కు­ట్టి"గా పి­లి­చే­వా­రు. వీ­రి­పై 1995 పా­ర్సి­ల్ బాం­బు కేసు, 1999లో తమి­ళ­నా­డు మరి­యు కే­ర­ళ­లో జరి­గిన సీ­రి­య­ల్ బాం­బు దా­డు­లు, 2011 మదు­రై­లో బీ­జే­పీ నా­య­కు­డు ఎల్.కె. అద్వా­నీ రథ­యా­త్ర­పై బాం­బు దాడి ప్ర­ణా­ళిక, 2013 మల్లే­శ్వ­రం బీ­జే­పీ కా­ర్యా­లయ బాం­బు దాడి, 2012లో వె­ల్లూ­రు­లో డా­క్ట­ర్ అర­విం­ద్ రె­డ్డి హత్య కే­సు­లు ఉన్నా­యి. తమి­ళ­నా­డు ఏటీ­ఎ­స్ వారి భా­ర్య­ల­ను అరె­స్టు చే­శా­రు. వారి ఇళ్ల­ల్లో జరి­గిన సో­దా­ల్లో భా­రీ­గా పే­లు­డు పదా­ర్థా­లు తయా­రు చేసే వస్తు­వు­లు పట్టు­బ­డ్డా­యి.

మారువేషాల్లో పట్టుకున్న అధికారులు

ఇద్ద­రు ఉగ్ర­వా­దు­లు రా­య­చో­టి­లో ఉన్నా­ర­నే నిఘా వర్గాల సమా­చా­రం­తో చె­న్నై ఐబీ అధి­కా­రు­లు ఈ ప్రాం­తం­లో మకాం వే­శా­రు. రెం­డు నె­ల­లు­గా మా­రు­వే­షా­ల్లో తి­రు­గు­తూ అను­మా­ని­తు­ల­పై నిఘా పె­ట్టా­రు. రా­య­చో­టి కొ­త్త­ప­ల్లి ప్రాం­తం­లో ఓ అద్దె ఇం­టి­లో ని­వా­సం ఉం­టు­న్న వీరి కా­ర్య­క­లా­పా­ల­ను ని­శి­తం­గా గమ­నిం­చా­రు. సో­మ­వా­రం రా­త్రి ఇద్ద­రు సో­ద­రు­ల­ను అదు­పు­లో­కి తీ­సు­కు­ని రహ­స్యం­గా తీ­సు­కె­ళ్లా­రు. ని­వా­సం­లో తని­ఖీ­లు ని­ర్వ­హిం­చ­గా ఉగ్ర కా­ర్య­క­లా­పా­ల­కు సం­బం­ధిం­చిన పు­స్త­కా­లు, మం­దు­గుం­డు సా­మ­గ్రి లభ్య­మై­న­ట్లు పో­లీ­సు వర్గాల ద్వా­రా తె­లి­సిం­ది. వీ­రి­పై రూ.కో­ట్ల­లో­నే రి­వా­ర్డు­లు ఉన్న­ట్లు నిఘా వర్గా­లు తె­లి­పా­యి. ఈ వ్య­వ­హా­రం­పై కర్నూ­లు రేం­జ్ డీ­ఐ­జీ కోయ ప్ర­వీ­ణ్ కీలక వి­ష­యా­ల­ను వె­ల్ల­డిం­చా­రు. నిం­ది­తు­లి­ద్ద­రూ 'అ­ల్‌ ఉమ్మా' ఉగ్ర­వా­దు­ల­ని తె­లి­పా­రు. దే­శం­లో­ని మూడు ప్ర­ధాన నగ­రా­ల్లో పే­లు­ళ్ల­కు కు­ట్ర పన్ని­న­ట్లు పే­ర్కొ­న్నా­రు అలూ­మా అనే­ది దక్షిణ భా­ర­త­దే­శం­లో అతి­పె­ద్ద ఉగ్ర­వాద సం­స్థ అని.. ఐసి­స్, అలూ­మా సం­స్థ­లు ఒకే వి­ధ­మైన ఆలో­చ­న­ల­తో పని­చే­స్తా­య­ని ఆయన అన్నా­రు.

Tags

Next Story