AP: చెప్పింది చెప్పినట్టు చేసేది కూటమి ప్రభుత్వమే

AP: చెప్పింది చెప్పినట్టు చేసేది కూటమి ప్రభుత్వమే
X
ఏపీలో ఆటోడ్రైవర్ల సేవలో పథకం ప్రారంభం.. లబ్ధిదారుల ఖాతాల్లో రూ.15 వేలు జమ.. ఆటోలో సభకు చంద్రబాబు, పవన్, లోకేశ్

చె­ప్పిన రోజు చె­ప్పి­న­ట్లు పని­చే­సే ప్ర­భు­త్వం తమ­ద­ని ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌ ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు తె­లి­పా­రు. వి­జ­య­వా­డ­లో ‘ఆటో డ్రై­వ­ర్ల సే­వ­లో’ పథ­కా­న్ని ప్రా­రం­భిం­చిన చం­ద్ర­బా­బు.. లబ్ధి­దా­రు­ల­కు రూ.436 కో­ట్ల­ను అం­దిం­చా­రు. డి­ప్యూ­టీ సీఎం పవ­న్‌ కల్యా­ణ్, మం­త్రు­లు నారా లో­కే­శ్, సత్య­కు­మా­ర్‌, బీ­జే­పీ ఏపీ అధ్య­క్షు­డు మా­ధ­వ్‌ తది­త­రు­లు పా­ల్గొ­న్నా­రు. "అం­ద­రూ OG సి­ని­మా చూ­శా­రు, దసరా పం­డుగ చే­సు­కు­న్నా­రు.. వి­జ­య­వాడ ఉత్స­వ్ తో నగ­రా­ని­కి కొ­త్త కళ వచ్చిం­ది.. నే­రు­గా లబ్ధి­దా­రు­ల­కు డబ్బు­లు జమ అయ్యా­యి.. ఆటో డ్రై­వ­ర్ల­కు అనేక కష్టా­లు ఉన్నా­యి.. గతం­లో రో­డ్లు గతు­కు­ల­తో ఆటో­లు, డ్రై­వ­ర్ల ఒళ్లు హూనం అయ్యే­ది అని ఆరో­పిం­చా­రు. వచ్చే ఎన్ని­క­ల్లో స్ట్రై­క్ రేట్ మరింత పె­ర­గా­లి.. గత ఎన్ని­క­ల్లో 94 శాతం స్ట్రై­క్ రేటు తో గె­లి­చా­రు.. నా­లు­గో­సా­రి గె­లి­చిన నాకు కూడా ఏం చే­యా­లో మొ­ద­ట్లో అర్థం కా­లే­దు.. స్త్రీ శక్తి పథ­కం­తో మహి­ళ­లు ఎక్క­డ­కి అంటే అక్క­డి వె­ళ్ళ­గ­లు­తు­న్నా­రు.. దసరా సమ­యం­లో అమ్మ­వా­రి దర్శ­నం కోసం రా­ష్ట్ర నలు­మూ­లల నుం­చి మహి­ళ­లు ఇం­ద్ర­కీ­లా­ద్రి­కి వచ్చా­రు అని సీఎం చం­ద్ర­బా­బు వె­ల్ల­డిం­చా­రు. ఆటో డ్రై­వ­ర్ల­లో చాలా మంది పేద వా­ళ్లే ఉం­టా­ర­ని... ఏడా­ది­కి రూ. 15 వేలు ఇస్తే.. వా­రి­కి కొంత ఊర­ట­గా ఉం­టుం­ద­నే ఈ ని­ర్ణ­యం తీ­సు­కు­న్నా­మ­ని చం­ద్ర­బా­బు తె­లి­పా­రు. గత ప్ర­భు­త్వం­లో రో­డ్ల­న్నీ గతు­కు­లే గతు­కు­ల­న్న చం­ద్ర­బా­బు.. మన ప్ర­భు­త్వం­లో ఎప్పు­డూ ఆ పరి­స్థి­తి రా­ని­వ్వ­బో­మ­ని హామీ ఇచ్చా­రు.

ఆటో డ్రైవర్లకు మరో శుభవార్త

ఆటో డ్రై­వ­ర్ల కోసం ఉబర్ తరహా యాప్ తె­స్తా­మ­ని ఆయన హామీ ఇచ్చా­రు. ఆటో డ్రై­వ­ర్ల కోసం ఒక యాప్ తయా­రు చేసి బు­కిం­గ్ లు వచ్చే­లా చే­స్తా­మ­ని తె­లి­పా­రు. ఆటో స్టాం­డు­కు వె­ళ్లి పడి­గా­పు­లు పడే అవ­స­రం లే­కుం­డా టె­క్నా­ల­జీ ద్వా­రా సహ­కా­రం అం­ది­స్తా­మన చె­ప్పా­రు. ఆటో డ్రై­వ­ర్ల సం­క్షేమ బో­ర్డు ఏర్పా­టు చేసి ఆటో డ్రై­వ­ర్ల భవి­ష్య­త్తు కోసం పని చే­స్తా­మ­ని భరో­సా ఇచ్చా­రు. అలా­గే ఒక కం­ట్రో­ల్ రూమ్ ఏర్పా­టు చేసి యాప్ ద్వా­రా అవ­కా­శా­లు దొ­రి­కే­లా చే­స్తా­మ­ని, ఆటో, మా­క్సి క్యా­బ్, క్యా­బ్ డ్రై­వ­ర్లం­ద­రి­కీ కూ­ట­మి ప్ర­భు­త్వం అం­డ­గా ఉం­టుం­ద­ని సీఎం చం­ద్ర­బా­బు హామీ ఇచ్చా­రు. వి­జ­య­వా­డ­లో 90 శాతం వా­హ­నా­లు సీ­ఎ­న్జీ ఇం­ధ­నం­తో­నే నడు­స్తు­న్నా­య­న్నా­రు. గతం­లో పె­ద్ద ఎత్తున జరి­మా­నా­లు వి­ధిం­చే­వా­ర­ని, జరి­మా­నా­లు భారం కా­కుం­డా చూ­స్తా­మ­న్నా­రు. ఆటో, మా­క్సి, క్యా­బ్ డ్రై­వ­ర్లు క్ర­మ­శి­క్ష­ణ­గా ఉం­డా­ల­ని సూ­చిం­చా­రు. "సు­ప­రి­పా­లన ది­శ­గా కూ­ట­మి ప్ర­భు­త్వం సా­గు­తోం­ది. జీ­ఎ­స్టీ సం­స్క­ర­ణ­ల­తో సూ­ప­ర్ సే­విం­గ్స్‌. దసరా, దీ­పా­వ­ళి, సూ­ప­ర్ సి­క్స్, సూ­ప­ర్ జీ­ఎ­స్టీ. గత ఐదే­ళ్ల వి­ధ్వం­సం నా జీ­వి­తం­లో చూ­డ­లే­దు. దు­ర్మా­ర్గు­లు రా­జ­కీ­యా­ల్లో ఉంటే అభి­వృ­ద్ధి శూ­న్యం. దు­ష్ట శక్తు­లు రా­కుం­డా ప్ర­జ­లు కా­పా­డు­కో­వా­ల్సిన అవ­స­రం ఉంది’’ అని చం­ద్ర­బా­బు వ్యా­ఖ్యా­నిం­చా­రు.

రూ. 15 వేలతో ఏం చేసుకోవాలి'

సీఎం చం­ద్ర­బా­బు, డి­ప్యూ­టీ సీఎం పవ­న్‌ కల్యా­ణ్‌ ప్రా­రం­భిం­చిన ఆటో డ్రై­వ­ర్ల సే­వ­లో కా­ర్య­క్ర­మం­పై మాజీ మం­త్రి పే­ర్ని నాని వి­మ­ర్శ­లు గు­ప్పిం­చా­రు. ఆటో, క్యా­బ్‌ డ్రై­వ­ర్ల­కు పం­డ­గే పండగ అని డై­లా­గు­లు కొ­డు­తు­న్నా­ర­ని తె­లి­పా­రు. రూ.15వే­ల­తో ఏం పం­డుగ చే­సు­కో­వా­ల­ని ప్ర­శ్నిం­చా­రు. అసలు ఈ పథ­కా­న్ని ప్రా­రం­భిం­చి­న­దే వై­ఎ­స్‌ జగ­న్‌ అని గు­ర్తు­చే­శా­రు. జగన్ ప్రారంభించిన పథకాన్నే కూటమి ప్రభుత్వం మరో పేరుతో అమలు చేస్తోందని పేర్ని నాని తీవ్రంగా మండిపడ్డారు.

Tags

Next Story