AP: నెరవేరిన ఉత్తరాంధ్రవాసుల చిరకాల కోరిక

AP: నెరవేరిన ఉత్తరాంధ్రవాసుల చిరకాల కోరిక
X
భోగాపురంలో ల్యాండ్‌ అయిన తొలి విమానం....ఢిల్లీ నుంచి భోగాపురానికి ప్రత్యేక విమానం... భోగాపురంలో 300 విమానాలు దిగే సౌలభ్యం

ఉత్త­రాం­ధ్ర­వా­సుల ఎదు­రు­చూ­పు­ల­కు తె­ర­ప­డిం­ది. వి­జ­య­న­గ­రం­లో­ని భో­గా­పు­రం అం­త­ర్జా­తీయ వి­మా­నా­శ్ర­యం­లో వి­మా­నం ది­గిం­ది. భో­గా­పు­రం­లో­ని అల్లూ­రి సీ­తా­రా­మ­రా­జు అం­త­ర్జా­తీయ వి­మా­నా­శ్ర­యం­లో ట్ర­య­ల్‌ రన్‌­లో భా­గం­గా వి­మా­నం ల్యాం­డ్ కా­నుం­ది. ఢి­ల్లీ నుం­చి బయ­ల్దే­ర­ను­న్న ఎయి­ర్ ఇం­డి­యా వి­మా­నం భో­గా­పు­రం ఎయి­ర్‌­పో­ర్టు­లో ది­గిం­ది. ఈ వి­మా­నం­లో కేం­ద్ర పౌ­ర­వి­మా­న­యాన శాఖ మం­త్రి కిం­జ­రా­పు రా­మ్మో­హ­న్ నా­యు­డు, వి­జ­య­న­గ­రం ఎంపీ క‌­లి­శె­ట్టి అప్ప­ల­‌­నా­యు­డు­తో పా­టు­గా ఇత‌ర ఉన్న­తా­ధి­కా­రు­లు భో­గా­పు­రం­లో ది­గా­రు. భో­గా­పు­రం అం­త­ర్జా­తీయ వి­మా­నా­శ్ర­యం­లో తొలి వి­మా­నం ది­గిం­ది.ఢి­ల్లీ నుం­చి ప్ర­త్యేక వి­మా­నం­లో భో­గా­పు­రా­ని­కి కేం­ద్ర­మం­త్రి కిం­జ­రా­పు రా­మ్మో­హ­న్ నా­యు­డు, తె­లు­గు­దే­శం వి­జ­య­న­గ­రం ఎంపీ కలి­శె­ట్టి అప్పల నా­యు­డు చే­రు­కు­న్నా­రు. భో­గా­పు­రం ఎయి­ర్‌­పో­ర్ట్‌­లో 300 వి­మా­నా­లు దిగే సదు­పా­యం కల్పిం­చిం­ది. తొలి దశ ని­ర్మాణ పను­ల­కు రూ.4,592 కో­ట్ల వ్య­యం అయిం­ది.

ఉత్త­రాం­ధ్ర వా­సుల కలల ప్రా­జె­క్టు అయిన భో­గా­పు­రం గ్రీ­న్‌­ఫీ­ల్డ్ ఎయి­ర్‌­పో­ర్టు పూ­ర్తి­స్థా­యి­లో అం­దు­బా­టు­లో­కి రా­వ­డం­తో దక్షిణ భా­ర­త­దే­శం­లో వి­శా­ఖ­ప­ట్నం.. ఒక ప్ర­ధాన ఆర్థిక కేం­ద్రం­గా మా­ర­నుం­ది. వి­మాన సర్వీ­సు­లు, అం­త­ర్జా­తీయ అను­సం­ధా­నం, వే­లా­ది ఉద్యో­గా­ల­తో ఉత్త­రాం­ధ్ర ము­ఖ­చి­త్రం మా­రు­తుం­ద­ని అధి­కా­రు­లు చె­ప్తు­న్నా­రు. మరో­వై­పు భో­గా­పు­రం అం­త­ర్జా­తీయ వి­మా­నా­శ్ర­యం­లో అనేక ఆధు­నిక సౌ­క­ర్యా­లు కల్పిం­చా­రు. ఎక్కువ సమయం వేచి చూ­డా­ల్సిన అవ­స­రం లే­కుం­డా.. ముఖ గు­ర్తిం­పు ద్వా­రా పే­ప­ర్ లెస్ ఎం­ట్రీ ఉం­టుం­ది. అలా­గే 10 కంటే ఎక్కువ ఆధు­నిక ఏరో­బ్రి­డ్జిల ద్వా­రా నే­రు­గా వి­మాన ప్ర­వే­శం ఉం­డే­లా ఏర్పా­ట్లు చే­స్తు­న్నా­రు. సో­లా­ర్ పవర్, వర్ష­పు నీటి రీ­సై­క్లిం­గ్ ద్వా­రాల లీడ్ గో­ల్డె­న్ రే­టిం­గ్ లక్ష్యం­గా భో­గా­పు­రం ఎయి­ర్‌­పో­ర్టు ని­ర్మా­ణం జరు­గు­తోం­ది.

భో­గా­పు­రం వి­మా­నా­శ్ర­యం మొ­ద­టి దశలో సం­వ­త్స­రా­ని­కి 60 లక్షల మంది ప్ర­యా­ణి­కు­ల­ను ని­ర్వ­హిం­చే­లా టె­ర్మి­న­ల్ ని­ర్మా­ణం జరు­గు­తోం­ది. భవి­ష్య­త్తు­లో ఈ సా­మ­ర్థ్యా­న్ని 1.8 కో­ట్ల వరకు పెం­చే అవ­కా­శా­లు ఉన్నా­యి. మరో­వై­పు 2025 డి­సెం­బ­ర్ నా­టి­కి భో­గా­పు­రం వి­మా­నా­శ్ర­యం పను­లు సు­మా­రు­గా 91.7 శాతం పూ­ర్త­య్యా­యి. 2026 మే లేదా జూన్ నా­టి­కి మి­గ­తా పను­లు పూ­ర్తి చే­యా­ల­నే లక్ష్యం­తో­అ­ధి­కా­రు­లు పని­చే­స్తు­న్నా­రు.

భారీ ఖర్చుతో నిర్మాణాలు

భో­గా­పు­రం ఎయి­ర్‌­పో­ర్టు తొ­లి­దశ ని­ర్మా­ణం కోసం సు­మా­రు 4,592 కో­ట్లు ఖర్చు చే­స్తు­న్నా­రు. అలా­గే వి­మా­నా­శ్ర­యా­ని­కి దగ్గ­ర­లో­నే 136 ఎక­రా­ల్లో ఏవి­యే­ష­న్ ఎడ్యు­కే­ష­న్ సి­టీ­ని ఏర్పా­టు చే­స్తు­న్నా­రు. వి­మా­నా­శ్ర­యం చే­రు­కో­వ­టా­ని­కి ప్ర­యా­ణి­కు­ల­కు ట్రా­ఫి­క్ ఇబ్బం­దు­లు లే­కుం­డా.. వి­శా­ఖ­ప­ట్నం, శ్రీ­కా­కు­ళం, వి­జ­య­న­గ­రం, మన్యం జి­ల్లాల నుం­చి రవా­ణా సౌ­క­ర్యా­లు కల్పి­స్తు­న్నా­రు. వి­మా­నా­శ్ర­యం పూ­ర్తి­స్థా­యి­లో అం­దు­బా­టు­లో­కి వస్తే ఈ ప్రాం­తం­ ఎకో టూ­రి­జం, టెం­పు­ల్ టూ­రి­జం, బీచ్ టూ­రి­జం అభి­వృ­ద్ధి చెం­దు­తా­య­ని అధి­కా­రు­లు చె­ప్తు­న్నా­రు. చు­ట్టు­ప­క్కల ఉన్న పర్యా­టక ప్రాం­తా­ల­కు సం­ద­ర్శ­కుల రాక పె­రు­గు­తుం­ద­ని.. మొ­త్తం­గా ఉత్త­రాం­ధ్ర రూ­పు­రే­ఖ­లు మా­ర­తా­య­ని ఆశా­భా­వం వ్య­క్తం చే­స్తు­న్నా­రు.

అత్యాధునిక సౌకర్యాలు

ఈ విమానాశ్రయంలో ఒకేసారి 300 విమానాలు దిగే సదుపాయాలు కల్పించడం విశేషం. అంతర్జాతీయ బిడ్స్ ద్వారా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విమానాశ్రయ నిర్మాణం చేపట్టారు. ముఖ్యంగా ప్రపంచంలోనే అతిపెద్ద విమానాలైన ఎయిర్‌బస్ A380, బోయింగ్ 747-8 వంటి భారీ విమానాలు కూడా సులభంగా ల్యాండ్ అయ్యేలా రన్‌వేలను డిజైన్ చేశారు.

ప్రయాణికుల సామర్థ్యం

తొలి దశ­లో­నే ప్ర­తి ఏడా­ది 60 లక్షల మంది ప్ర­యా­ణి­కు­లు ప్ర­యా­ణిం­చ­గ­లి­గే సా­మ­ర్థ్యం ఉన్న టె­ర్మి­న­ల్‌­ను ని­ర్మిం­చ­ను­న్నా­రు. ఇది వి­శా­ఖ­ప­ట్నం, వి­జ­య­న­గ­రం, శ్రీ­కా­కు­ళం జి­ల్లాల ప్ర­జ­ల­కు ఉప­యో­గ­ప­డ­నుం­ది. భవి­ష్య­త్తు­లో ప్ర­యా­ణి­కుల సం­ఖ్య పె­రి­గే అవ­కా­శా­ల­ను దృ­ష్టి­లో ఉం­చు­కు­ని వి­స్త­ర­ణ­కు ప్ర­ణా­ళి­క­లు సి­ద్ధం­గా ఉన్నా­యి. వా­ణి­జ్యం, పర్యా­ట­కం, ఉపా­ధి అవ­కా­శా­ల­కు కేం­ద్రం­గా మా­ర­నుం­ది.

Tags

Next Story