AP: ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు

దిత్వా తుఫాన్ ప్రభావంతో రాబోయే రెండు రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. కాబట్టి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చారు. దిత్వా ప్రభావంతో రేపు తిరుపతి జిల్లాలోఅతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో రేపు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు, అంగన్వాడీలకు కలెక్టర్ వెంకటేశ్వర్లు సెలవు ప్రకటించారు. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు కూడా తుపాను ముప్పు ఉన్న నేపథ్యంలో.. ఆయా జిల్లాల్లోనూ విద్యాసంస్థలకు సెలవు ఇవ్వాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. డిసెంబర్ 1న ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
3 రోజులపాటు వర్షాలు
ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల నుంచి దిత్వా తుఫాను కేంద్రం దాదాపు కనీసం 70 కి.మీ దూరంలోఉంది. ఇది రాబోయే 18 గంటల్లో ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా ఉత్తరం వైపు కదిలే అవకాశం ఉంది. ఉత్తరం వైపు కదులుతూ తమిళనాడు-పుదుచ్చేరి తీరప్రాంతం మధ్యాహ్నానికి కనీసం 60 కి.మీ, సాయంత్రానికి 30 కి.మీ దూరంలో నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంటుంది. ఈదురు గాలులు గంటకు 35-45 కి.మీ. వేగంతో, గరిష్టంగా 55 కి.మీ. వేగంతో వీచే అవకాశముంది. అనేక చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు మరియు ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 35-45 కి.మీ. వేగంతో, గరిష్టంగా 55 కి.మీ. వేగంతో వీచే అవకాశముంది. డిసెంబర్ 2న కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశముంది. పుదుచ్చేరికి ఆగ్నేయంగా 110 కి.మీ., వేదరన్నియంకి ఈశాన్యంగా 140 కి.మీ., చెన్నైకి దక్షిణ-ఆగ్నేయంగా 180 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

