APSRTC: త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఏపీ రవాణశాఖ మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి కీలక ప్రకనట చేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని తెలిపారు. ఆర్టీసీ, రవాణా శాఖలపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గత ఐదేళ్ల జగన్ పాలనలో ఆర్టీసీ పూర్తిగా నిర్వీర్యమైందని మండిపడ్డారు. కారుణ్య నియామకాలపై చర్చించామన్న ఆయన.. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై సీఎంతో చర్చిస్తామని మంత్రి తెలిపారు. ఏపీలో రేషన్, మైన్స్ అక్రమ రవాణాను నివారిస్తామని రామ్‌ప్రసాద్‌రెడ్డి వెల్లడించారు. ఆర్టీసీలో కాలం చెల్లిన బస్సులను తొలగించి కొత్తవి తీసుకొస్తామని చెప్పారు. ఆర్టీసీలో 7 వేల మంది సిబ్బంది కొరత ఉందని.. వీటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుటుందని తెలిపారు. ఆర్టీసీ, రవాణా శాఖలపై ఈనెల 12న మరోసారి సీఎం సమీక్షిస్తారన్న ఆయన.. మహిళలకు ఉచిత ప్రయాణం అమలుపై సీఎం చర్చిస్తారని చెప్పారు.
చంద్రబాబు కీలక సమీక్ష
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార, ప్రతిపక్షాలు దృష్టి సారించాయి. ఇప్పటికే వైసీపీ క్యాంప్ రాజకీయాలకు తెరలేపగా.. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగారు. విశాఖ నేతలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. టీడీపీలో ఇంకా విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక పంచాయతీపై స్పష్టత లేనట్లు తెలుస్తోంది. ఇవాళ టీడీపీ అభ్యర్థిరై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అభ్యర్థి ఎంపికపై ఈ సమావేశంలో అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. అర్బన్‌లో ఎన్ని ఓట్లు.. రూరల్ ఎన్ని ఓట్లు ఉన్నాయనే అంశంపై సమీక్ష నిర్వహించారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలను వైసీపీ ఇప్పటికే క్యాంపులకు తరలించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి పార్టీ నేతలు తీసుకెళ్లారు. జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీల బలా బలాలపై నేతలతో చంద్రబాబు చర్చించారు.
విశాఖ రూరల్ నుంచి మరింత సమాచారం తీసుకోవాలని చంద్రబాబు.. విశాఖ నేతలను ఆదేశించారట.. కాగా, స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధుల బలం.. తమకు ఎక్కువగా ఉన్నందున.. గెలుపు మాదేననే ధీమాలో వైసీపీ ఉంది.. మరి.. కూటమి నేతలతో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు ఎలాంటి వ్యూహం రచిస్తారనేది ఆసక్తిగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com