AP: ఆంధ్రప్రదేశ్ హోంమంత్రిపైనే ట్రోలింగ్

ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా సోషల్ మీడియాలో నెగిటీవ్ ట్రోలింగ్ మాత్రం ఆగడంలేదు. తాజాగా ఏపీ హోంమంత్రి అనిత ట్రోలింగ్‌కు గురయ్యారు. ట్రోల్ చేస్తోంది మరెవ్వరో కాదు.. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో భాగమైన బీజేపీ మద్దతుదారులు కామెంట్స్ పెట్టారు. టీచర్స్ డే సందర్భంగా మంత్రి అనిత పేరెంట్స్‌తో కలిసి దిగిన ఫోటోని ఎక్స్ వేదికగా షేర్ చేశారు. మనకు తొలి ఉపాధ్యాయులు ఎవరు అంటే, మన తల్లిదండ్రులే, తల్లిదండ్రులు మనకు కేవలం జన్మనిచ్చేవారు మాత్రమే కాదు, మనకు మొదటి అక్షరం నేర్పినవారని ఆమె ట్వీట్లో రాసుకొచ్చారు. పోస్టుకు కింద చాలా మంది నెటిజన్లు పేరెంట్స్ క్రిస్ట్రియన్స్లా కనిపిస్తున్నారని.. ‘బియ్యపు బస్తా’ పేరుతో మంత్రి అనిత పై ట్రోల్స్ షురూ చేశారు. ఆమెని ట్రోల్ చేస్తున్న వాళ్లందరూ.. సనాతని ఫ్లాగ్స్ కలిగిన బీజేపీ మద్దతుదారులే అని నెటిజన్ల ప్రొఫైల్ చూస్తే తెలుస్తోంది. అయ్యో మీ కుటుంబం మొత్తం ప్రభువును నమ్ముకున్నారా? అమ్మా అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు. కన్వర్ట్ క్రిస్టియన్, గొర్రె బిడ్డ అంటూ హేళన చేస్తూ కామెంట్స్ పెట్టారు. మీరు క్రిస్టియన్ అయితే తిరుమల వెళ్లినప్పుడు డిక్లరేషన్‌పై సంతకం చేశారా? అని మరో నెటిజన్ మంత్రిని ప్రశ్నించారు. దీనిపై తీవ్ర విమర్శలు వస్తన్నాయి.
"ఎస్ఎఫ్ఐ ఛలో విజయవాడ" ఉద్రిక్తం
పెండింగ్‌లో ఉన్న ఉపకారవేతనాల విడుదల, జీవో నెంబర్ 77 రద్దు, ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీ, తల్లికి వందనం అందరికీ వర్తింప చేయాలన్న తదితర డిమాండ్లతో విజయవాడ ధర్నాచౌక్ వద్ద ఆందోళన చేస్తున్న ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు, విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. వారందర్నీ అజిత్ సింగ్ నగర్, సత్యనారాయణపురం, వన్‌టౌన్ పోలీస్స్టేషన్లకు తరలించారు. స్ఫృహ తప్పి పడిపోయిన మహిళా విద్యా్ర్థినిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com