AP: ఆంధ్రప్రదేశ్‌లో ఉగ్ర కలకలం..ఒకరు అరెస్ట్

ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లాలో ఉగ్ర కదలికలతో తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ధర్మవరంలో ఐబీ అధికారులు, పోలీసులు తనిఖీలు చేశారు. కోట కాలనీలో నూర్ మహమ్మద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పోలీసులతో కలిసి ఐబీ అధికారులు అతడి ఇంటిని తనిఖీ చేశారు. అక్కడ అనుమానిత వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నూర్ మహమ్మద్ పాకిస్థాన్‌కు ఫోన్ కాల్స్ చేస్తూ అక్కడి ఉగ్రవాదులతో చాటింగ్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఐబీ అధికారులు అతడిని ప్రశ్నిస్తున్నారు. నిందితుడు ధర్మవరం మార్కెట్ వీధిలోని టీస్టాల్లో పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఏపీలో ఉగ్ర కదలికలపై నిఘావర్గాలు, ఏపీ పోలీసులు ఫోకస్ పెట్టారు. నూర్ మహమ్మద్‌కు పాకిస్తాన్‌కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో లింకులు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో గుర్తించింది. భారతదేశంలో నిషేధించిన ఉగ్రవాద సంస్థలకు చెందిన వాట్సప్ గ్రూపుల్లో సభ్యుడిగా ఉన్నట్లు ఐబీ అధికారులు పేర్కొన్నారు. ముస్లిం యువతను అతడు ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే.. ఏపీలో ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా(సీమీ) ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్న స్టూడెంట్స్‌ను గుర్తించినట్లు అధికారులు చెప్పారు. ఏప్రిల్ 25న పది మంది అనుమానితులను నిఘా వర్గాలు గుర్తించాయని ఐబీ అధికారులు తెలిపారు.
ఉగ్రవాదులతో చర్చలు
ఆన్లైన్ కాల్స్ ద్వారా పాకిస్తాన్‌లోని జైషే మహమ్మద్, ఇతరులతో నూర్ మహమ్మద్ మాట్లాడినట్టు వివరించారు. ఏపీలో ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా(సీమీ) ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్న స్టూడెంట్స్‌ను గుర్తించినట్లు అధికారులు చెప్పారు. ఉగ్రవాది నూర్ మహమ్మద్‌పై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో నూర్ మహమ్మద్ క్రియాశీల వ్యక్తిగా ఉన్నట్లు నిర్ధారణ అయింది. ధర్మవరం రూరల్ మండలానికి చెందిన యువకుడు రియాజ్ తన వాట్సప్‌లో పాకిస్థాన్‌కు మద్దతుగా ఆ దేశ జెండాతో పాక్ ఇన్ఫుయెన్సర్ సయ్యద్ బిలాల్ వీడియోను స్టేటస్‌గా పెట్టుకున్నారు. నూర్ మహమ్మద్‌ను విచారిస్తున్న సమయంలో మరో యువకుడి పేరు కూడా బయటకు వచ్చింది. దీంతో పోలీసులు అతన్ను విచారించి వదిలిపెట్టారు. మే 18న విజయనగరంలో ఉగ్ర కుట్రలను ఏపీ పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. ఇద్దరు ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తున్న సిరాజ్, సమీర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఉగ్ర కార్యకలాపాలపై ఏపీ పోలీసులు , NIA సంయుక్తంగా విచారణ చేపట్టింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com