AP: ఏఐ హబ్‌గా విశాఖ..లక్షల ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్‌ను ఏఐ హబ్‌గా మార్చేందుకు విశాఖపట్నంలో కీలక ముందడుగు పడింది. వైజాగ్‌లో 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో గూగుల్‌కు ఇప్పటికే అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంపై ఇరు వర్గాల ప్రతినిధులు సంతకాలు చేశారు. దాదాపు 10 బిలియన్ డాలర్ల పెట్టుబడితో అసియాయాలోనే అతిపెద్ద డేటా సెంటర్ నిర్మించనుంది గూగుల్. ఈ ప్రాజెక్ట్ ద్వారా 2028-2032 మధ్య రాష్ట్ర జీడీపీకి ఏటా రూ.10,518 కోట్లు, 1.88 లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభించనున్నట్లు అంచనాలు ఉన్నాయి.
1.88 లక్షల ఉద్యోగాలు..!
విశాఖను ఏఐ సిటీగా మార్చేందుకు ఈ ఒప్పందం పునాది వేయనుంది. సుమారు 10 బిలియన్ డాలర్ల (రూ.88,628 కోట్ల) పెట్టుబడితో.. 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది గూగుల్. ‘గూగుల్ ఏఐ హబ్’ పేరుతో భారత్‌లోనే తొలి కృత్రిమ మేధస్సు కేంద్రం ఏర్పాటుకు ఏపీ సర్కార్ విశాఖపట్నంలో శ్రీకారం చుట్టనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 2028- 2032 మధ్య.. రాష్ట్ర స్థూల ఉత్పత్తికి ఏటా రూ.10,518 కోట్లు సమకూరుతుందనే అంచనాలు ఉన్నాయి. అంతేకాకుండా దాదాపు 1,88,220 ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాల కల్పనకు కూడా అవకాశం ఏర్పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ డేటా సెంటర్ అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ఐటీ ఎకోసిస్టమ్ మొత్తం మారిపోనుంది. వైజాగ్ ఏఐ సిటీగా మారిపోనుంది.
భారీగా ఉద్యోగాల భర్తీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఏపీని అన్ని విధాలుగా ప్రగతి పథంలో ముందుకు నడిపించడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే నిరుద్యోగుల విషయంలో కూడా ఉద్యోగాలు, ఉపాధి కల్పన పైన పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తుంది. గతంలో టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2014లో స్వల్ప సంఖ్యలో ఖాళీలను భర్తీ చేసింది. ఆ తర్వాత వైసిపి హయాంలో ఖాళీలు భర్తీ చేస్తారని భావించిన ఐదేళ్లపాటు అది జరగలేదు. గత ఐదేళ్లలో పలువురికి పదోన్నతులు రావడం, పలువురు రిటైర్ కావడం తో చాలా పోస్టులు ఖాళీ అయ్యాయి. వివిధ క్యాడర్ లలో 40 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక ఈ సమస్యను ఉద్యోగ సంఘాలు యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లగా, కూటమి సర్కార్ ఈ ఖాళీలను భర్తీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఇప్పటివరకు పదోన్నతులు వచ్చిన వారు పదోన్నతి తో పాటు , తాము గతంలో నిర్వహించిన బాధ్యతను కూడా అదనంగా నిర్వహించాల్సి వస్తుంది. రెండు పోస్టుల విధులతో వారిపైన పని ఒత్తిడి పెరిగింది.
ఐదేళ్లలో లక్ష ఉద్యోగాలు
రాజధాని అమరావతిలో ఏర్పాటుచేసే క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ దక్షిణాసియాలోనే మొదటిదని ఐటీ, విద్య, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి లోకేశ్ వెల్లడించారు. ఇందులో ఐదేళ్లలో లక్ష మందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. 50కి పైగా యూనికార్న్‌లు అభివృద్ధి చేస్తామన్నారు. ఈ వ్యాలీ చంద్రబాబు సాంకేతిక విప్లవంలో సెకండ్ చాప్టర్‌గా పేర్కొన్నారు. సోమవారం విజయవాడలో క్వాంటమ్ వ్యాలీ వర్క్‌షా్‌పలో ఆయన మాట్లాడారు. వచ్చే జనవరి 1న ప్రారంభించే ఈ క్వాంటమ్ వ్యాలీకి అనుబంధంగా.. ఆలోచనలను ఆవిష్కరణలుగా.. ఆవిష్కరణలను పరిశ్రమలుగా మార్చే ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇది ఒకరోజు కార్యక్రమం కాదని.. నిరంతర కొనసాగుతుందని.. దీనికి అమరావతి కేంద్ర బిందువుగా ఉంటుందని అన్నారు. క్యూబిక్ ఆర్కిటెక్చర్ నుంచి క్రయోఎలకా్ట్రనిక్స్ వరకూ.. అల్గారిథం అభివృద్ధి నుంచి క్వాంటమ్ సామర్థ్యాన్ని అభివ్దృద్ధి చేస్తామని వెల్లడించారు. దేశంలో అత్యంత అభివృద్ధి చెందిన ఐబీఎం క్వాంటమ్ సిస్టమ్-2 త్వరలోనే అమరావతిలో అందుబాటులోకి వస్తుందని, ఇది చాలా గర్వించదగ్గ విషయమని చెప్పారు.
కూటమి సర్కార్ కీలక చర్యలు
రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు దాటి పోతున్నా నిరుద్యోగ సమస్య అనుకున్న మేర తగ్గడం లేదు. 2014-19లో కొంత మేర సమస్యను పరిష్కరించినప్పటికీ.. 2019-2024 వరకు ఈ సమస్య మరింత పెరిగింది. ఉద్యోగాలు లేక యువతీ, యువకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏదో ఒక పని చేసుకునేందుకు ఇతర దేశాలు, రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. చదువుకు తగ్గ ఉద్యోగం దొరకకపోయినా ఏదో ఒక పని చేసుకుంటూ కష్టాలుపడుతూ అక్కడే పోతున్నారు. ఇలాంటి పరిస్థితులు లేకుండా నిరుద్యోగ సమస్యను చక్కదిగ్గేందుకు కూటమి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. మంత్రి నారా లోకేశ్ చొరవతో ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాల కోసం రాష్ట్రవ్యాప్తంగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం నుంచి మెగా డీఎస్సీని నిర్వహించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com