AP: వీధి రౌడీలను తలపిస్తున్న వాలంటీర్లు

AP: వీధి రౌడీలను తలపిస్తున్న వాలంటీర్లు
తిరుపతిలో రెచ్చిపోయిన స్ధానిక వాలంటీర్ సంధ్య; వైసీపీ రౌడీ మూకలతో కలిసి ఎదురింటి మహిళపై వీరవిహారం

ఏపీలో వాలంటీర్లు వీధి రౌడీలను తలపిస్తున్నారు. వాలంటీర్లు అందిస్తున్న సేవలను వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రశంసిస్తుంటే.. వాలంటీర్లు మాత్రం వీధి రౌడీల్లా జనాలపై రెచ్చిపోతున్నారు. తిరుపతిలోని 21వ డివిజన్ పరిధిలోని ఎస్వీ యూనివర్సిటి.. సీతమ్మకాలనీలో స్ధానిక వాలంటీర్ సంధ్య రెచ్చిపోయింది. ప్రకాశ్, ప్రవీణ్ అనే వైసీపీ రౌడీ మూకలను తీసుకువచ్చి ఎదిరింటి జానకిపై వీరవిహారం చేసింది. బాధితురాలు తన ఇంటి ముందు వర్షం నీరు చేరుతుందని, మట్టి పోసి చదును చేసుకుంది. దీంతో జానకిపై ఆగ్రహించిన వాలంటీర్ కాలుతో తన్ని మెడలోని తాళిబొట్టును లాగింది. గాయాలతో బాధితురాలు రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.

కడుపులోని అవయవాలకు అయిన గాయాలు ఇన్‌ఫెక్షన్‌ కావడంతో తరచు వాంతులు చేసుకుంటుందని బాధితురాలి భర్త వాపోయారు. న్యాయం చేయాల్సిన పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కేసును రాజీ చేసుకుని వెళ్లండి.. లేదంటే మీ ఇంటిని కూల్చేస్తామని వాలంటీర్ బంధువులు బెదిరింపులకు దిగుతున్నారని తెలిపారు. బాధితురాలి ఫిర్యాదుపై కేసు నమోదు చేయని పోలీసులు రౌడీ మూకలకు అండగా నిలుస్తున్నారని ఆరోపిస్తున్నారు. తనపై దాడి చేయించిన వాలంటీర్, వైసీపీ రౌడీ మూకల నుంచి ప్రాణహాని ఉందని తెలిపారు. చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని బాధితురాలి భర్త కోరుకుంటున్నారు.


Tags

Next Story