AP: సంక్షేమం పరిఢవిల్లేలా.. అభివృద్ధి పరుగులెత్తేలా..

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీలో బడ్జెట్ పెట్టారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఏపీ అసెంబ్లీలో ఉదయం 11.22 నిమిషాలకు పెట్టారు. ఈసారి బడ్జెట్‌ను రూ.3.32 లక్షల కోట్ల అంచనాతో ప్రవేశపెట్టారు. సంక్షేమ పథకాలకు, ప్రాజెక్టులకు భారీగా కేటాయింపులు చేశారు. ఇటు మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెడతారు. అంతకముందు ఏపీ కేబినెట్ భేటీలో బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు. ఈ రోజు మనం ఎంచుకున్న మార్గాలే... రేపటి మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి’ అని అన్నారు ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్. రాష్ట్ర ఆర్థికవ్యవస్థను జాగ్రత్తగా నిర్వహిస్తూ ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తున్నామని అందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను బడ్జెట్ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ముఖ్యంగా గత ప్రభుత్వం అడ్డగోలుగా చేసిన అప్పులపై వడ్డీరేట్లు తగ్గించేందుకు పలు చర్యలు చేపట్టినట్లు పయ్యావుల వివరించారు. వడ్డీ రేటుతో సంబంధం లేకుండా ఏకంగా 12.3 శాతం వరకు కూడా వైకాపా ప్రభుత్వం అప్పులు తెచ్చింది. రాష్ట్రానికి ఆర్థిక భారంగా పరిణమించిన ఆ వడ్డీ రుణాలను 9శాతం లేదా అంతకంటే తక్కువకు తీసుకురావడానికి వడ్డీ రేట్ల తగ్గింపు చర్యలను చేపడుతున్నాం. రాష్ట్ర రెవెన్యూ లోటు గణనీయంగా తగ్గింది అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. 2025- 26 రివైజ్డ్ అంచనాల ప్రకారం రెవెన్యూ లోటు రూ. 41, 118.36 కోట్లుకు చేరింది. 2026-27 బడ్జెట్ అంచనాల ప్రకారం రెవెన్యూ లోటు రూ. 22, 002.50 కోట్లు ఉంది.
2025-26 రివైజ్డ్ అంచనాల ప్రకారం రూ. 80,567.47 కోట్ల ద్రవ్య లోటుగా నమోదు అయింది. ఇక, 2026-27 బడ్జెట్ అంచనాల ప్రకారం ద్రవ్య లోటు రూ. 75,868.09 కోట్లుగా ఉండొచ్చని అంచనా. "ఇప్పటివరకు రూ.43,298 కోట్ల రుణాలకు వడ్డీని తగ్గించి, సంవత్సరానికి రూ.327 కోట్లు ఆదా చేశాం. అదనంగా మరో రూ.1.2 లక్షల కోట్ల రుణాలపై మెరుగైన షరతులు పొందేందుకు చర్యలు తీసుకుంటున్నాం. దీనిద్వారా సంవత్సరానికి సుమారు రూ.1,658 కోట్ల ఆదా అవుతుందని అంచనా. పంచాయతీలు, మున్సిపాలిటీలను బలోపేతం చేయడానికి ఆర్థిక సంఘం గ్రాంట్ల కింద రూ.3,797 కోట్లను విడుదల చేశాం. 12 జూన్ 2024 నాటికి పెండింగ్‌లో ఉన్న రూ.24,811 కోట్ల బకాయిలను క్లియర్ చేశాం. సాగునీరు, రహదారులు, ఇతర పనులకు రూ.37,030 కోట్లను చెల్లించి ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించాం." అని పయ్యావుల కేశవ్ తెలిపారు. . గత పాలనలో దెబ్బతిన్న పోలీసు వ్యవస్థ గౌరవాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఈ సందర్భంగా..‘‘మంచివారు భయపడనప్పుడు చెడు శక్తులు బలహీనమవుతాయి’’ అని అమెరికా మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ వ్యాఖ్యను ప్రస్తావించారు. డిజిటల్ అరెస్టులు, ఆన్‌లైన్ మోసాలు వంటి ఆధునిక నేరాలను ఎదుర్కొనేందుకు ప్రతిజిల్లాలో ప్రత్యేక సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
