Minister Savita : అభివృద్ధిలో ఏపీ పరుగులు పెడుతుంది - మంత్రి సవిత

Minister Savita : అభివృద్ధిలో ఏపీ పరుగులు పెడుతుంది - మంత్రి సవిత
X

గత జగన్ సర్కార్ అభివృద్ధి కార్యక్రమాలను గాలికొదిలేసిందని ఏపీ మంత్రి సవిత ఆరోపించారు. వైసీపీ చేసిన అభివృద్ధి శిలాఫలకాలకే పరిమితమైందని విమర్శించారు. కానీ తాము అధికారంలోకి వచ్చాక ఏడాది వ్యవధిలోనే ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ గోరంట్ల మండలం బూదిలి సమీపంలో చిత్రావతి నదిపై 8 కోట్ల 52 లక్షల రూపాయలు నిధులతో నిర్మించనున్న బ్రిడ్జికి మంత్రి భూమి పూజ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అభివృద్ధిలో రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు పరుగులు పెట్టిస్తున్నారని చెప్పారు. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ తమది ప్రజాప్రభుత్వమని నిరూపించుకున్నట్లు తెలిపారు. జగన్ బటన్లు నొక్కడం పేరుతో ప్రజలను మోసం చేశారని.. ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. అందుకే ప్రజలు ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పారన్నారు. కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు వైసీపీకి లేదని అన్నారు.

Tags

Next Story