జగన్‌ సర్కారు నివర్‌ తుఫాను బాధితుల్ని ఆదుకోవాలి : తులసిరెడ్డి

జగన్‌ సర్కారు నివర్‌ తుఫాను బాధితుల్ని ఆదుకోవాలి : తులసిరెడ్డి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు విరమించుకోవాలని ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి డిమాండ్‌ చేశారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా అన్నదాతల సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. నూతన వ్యవసాయ చట్టాల్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని చెప్పారు. వ్యవసాయ మోటార్లకు విద్యుత్‌ మీటర్లు బిగింపు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రుణమాఫీ పథకంలో 8వేల కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేయాలి అన్నారు. నివర్‌ తుఫాను బాధితుల్ని జగన్‌ సర్కారు ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.


Tags

Read MoreRead Less
Next Story