APSRTC : ఏపీలో ఆర్టీసీ ఛార్జీల పెంపు

APSRTC :  ఏపీలో ఆర్టీసీ ఛార్జీల పెంపు
APSRTC : ఏపీలో జనం నెత్తిన బండలు పడుతూనే ఉన్నాయి.. మొన్నటికి మొన్న విద్యుత్ ఛార్జీలు పెంచి వాతలు పెట్టిన జగన్‌ ప్రభుత్వం తాజాగా ప్రయాణికుల నడ్డి విరిచేందుకు సిద్ధమైంది..

APSRTC : ఏపీలో జనం నెత్తిన బండలు పడుతూనే ఉన్నాయి.. మొన్నటికి మొన్న విద్యుత్ ఛార్జీలు పెంచి వాతలు పెట్టిన జగన్‌ ప్రభుత్వం తాజాగా ప్రయాణికుల నడ్డి విరిచేందుకు సిద్ధమైంది.. ఈసారి బాదుడు వంతు ఆర్టీసీ తీసుకుంది.. డీజిల్‌ సెస్‌ పేరుతో ఆర్టీసీ బాదుడు మొదలు పెట్టింది.

ఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరగనున్నాయి.. పెరిగిన ఛార్జీలను ఈ రేపట్నుంచి అమలు చేయనున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.. డీజిల్‌ ధరలు విపరీతంగా పెరగడం వల్ల సంస్థ నష్టాల్లో ఉందన్నారు.. నష్టాల నుంచి కొంత మేర ఉపశమనం కోసమే డీజిల్‌ సెస్‌ పెంచుతున్నట్లు చెప్పారు.

పల్లె వెలుగు బస్సుల్లో కనీస ఛార్జీ ఇకపై పది రూపాయలుగా ఉండనుంది.. అలాగే ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులపై ఐదు రూపాయలు.. ఏసీ బస్సుల్లో డీజిల్ సెస్‌ కింద 10 రూపాయలు పెంచనున్నారు.. అయితే, టికెట్‌ రేట్లు పెంచలేదని.. డీజిల్‌ సెస్‌ మాత్రమే పెంచామని ఆర్టీసీ ఎండీ చెప్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story