AP : చిట్యాల పొలాల్లో హెలికాప్టర్ ఎందుకు దిగింది.. ఆ తర్వాత ఏం జరిగింది?
విజయవాడలోని వరద బాధితులకు సాయం అందించేందుకు వెళ్లిన ఆర్మీ హెలికాప్టర్ హైదరాబాద్ కు తిరిగి వస్తూ గురువారం సాంకేతిక లోపంతో నల్లగొండ జిల్లా చిట్యాల పట్టణ సమీపంలోని మెండే సైదులు వ్యవసాయ పొలంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. ముగ్గురు ఆర్మీ అధికారులతో విజయవాడ నుంచి హకీంపేటవెళుతున్న ఆర్మీ హెలికాప్టర్ లో సాంకేతిక లోపం ఏర్పడడంతో ఇది గమనించిన పైలెట్ హెలికాఫ్టర్ ను మెండే సైదులు వ్యవసాయ క్షేత్రంలో పరిధిలో గల వ్యవసాయ పొలాల్లో సురక్షితంగా దింపాడు. దీంతో అక్కడ వ్యవసాయ పనులు చేసుకుంటున్న మెండే సైదులు వ్యవసాయ కూలీలు, రైతులు ఆందోళనకు గురయ్యారు.
విషయం తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. భారీ వర్షాల వల్ల వరద ప్రభావంలో చిక్కుకున్న విజయవాడ పట్టణంలోని వరద బాధితులకు సహాయం అందించేందుకు జైపూర్ నుండి 5 ఆర్మీ హెలిక్యాప్టర్లు విజయవాడకు వెళ్లాయి. అక్కడ వారికి సాయం అందించిన అనంతరం ఐదు హెలికాప్టర్లు హకీంపేటకు వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. వెంటనే హైదరాబాద్ నుండి టెక్నీషియన్స్ ను పిలిపించి మరమ్మతులకు గురైన హెలిక్యాప్టర్ ను రిపేర్ చేయడంతో సాయంత్రం హకీంపేటకు వెళ్ళిపోయింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com