ఏపీలో రెండవ దశ పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి!

ఏపీలో రెండవ దశ పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి!
ఎల్లుండి పంచాయతీ రెండో దశ ఎన్నికల సందర్భంగా డీజీపీ, సీఎస్ ఇవాళ ఎస్‌ ఈసీ రమేష్ కుమార్‌తో సమావేశమై ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించనున్నారు.

ఏపీలో రెండవ దశ పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎల్లుండి పంచాయతీ రెండో దశ ఎన్నికల సందర్భంగా డీజీపీ, సీఎస్ ఇవాళ ఎస్‌ ఈసీ రమేష్ కుమార్‌తో సమావేశమై ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించనున్నారు. తొలివిడత ఎన్నికల పరిస్థితులు, అధికారుల పనితీరు, లోటుపాట్లపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. రెండో దశ పోలింగ్‌లో సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టిపెట్టారు.

రెండో దశ ఎన్నికలు ఎల్లుండి జరుగనుండటంతో ఆయా గ్రామాల్లో అభ్యర్ధుల ప్రచారం ఈ రాత్రి ముగియనుంది. రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత పోలింగ్ 3వేల 328 గ్రామపంచాయితీలకు ఎన్నికలు నోటిఫికేషన్ రాగా.. 539 సర్పంచ్‌ అభ్యర్ధులు ఏకగ్రీవం అయ్యారు. మిగిలిన 2వేల 789 గ్రామ పంచాయతీల్లోని సర్పంచ్ పదవులకు ఈనెల 13న పోలింగ్ జరుగనుంది.

రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 2వేల 789 గ్రామ పంచాయతీలకు గాను.. 7వేల 510 మంది అభ్యర్ధులు పోటీపడుతున్నారు. అదేవిధంగా ఆయా గ్రామాల్లో మొత్తం 33వేల 570 వార్డు పదవులకు ఎన్నికలు జరుగుతుండగా.. ఇందులో 12వేల 605 ఏకగ్రీవాలయ్యాయి. మిగతా 20వేల 965 వార్డులకు గాను 44 వేల 879 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.

రెండవ విడత పోలింగ్ ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్ ఉంటుంది. అనంతరం అదే ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమై ఫలితాలను వెల్లడించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story