పోలీసులకు చిక్కిన నిత్య పెళ్లికొడుకు

పోలీసులకు చిక్కిన నిత్య పెళ్లికొడుకు
అరుణ్‌ కుమార్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్న వారు చాలా మంది ఉన్నట్టు తెలుస్తోంది.

విశాఖలోని నిత్య పెళ్లి కొడుకు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. 8 మంది మహిళల్ని పెళ్లాడి మోసం చేసి పరారైన అరుణ్‌కుమార్‌ను కంచెరపాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

డీజీపీ అదేశాల మేరకు రెండు ప్రత్యేక బృందాలతో గాలించారు. ప్రస్తుతం పోలీస్‌స్టేషన్‌లో ఉన్న నిందితుడు అరుణ్‌కుమార్‌ చీకటి కోణాలపై పోలీసులు విచారిస్తున్నారు.నిందితుడి నుంచి వచ్చిన సమాచారం మేరకు బాధితులను సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారు. అరుణ్‌ కుమార్‌ చేతిలో మోసపోయిన వారు నేరుగా తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు స్పష్టం చేశారు. ఇప్పటికే ఈకేసులో ఫిర్యాదు చేసిన ఇద్దరు బాధిత మహిళల నుంచి పోలీసులు సమాచారం సేకరించారు. అరుణ్‌ కుమార్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్న వారు చాలా మంది ఉన్నట్టు తెలుస్తోంది.

Tags

Next Story