ఆంధ్రప్రదేశ్

Konaseema District: కోనసీమ జిల్లాలో ఉద్రిక్తత.. దళిత వృద్ధుడి మృతదేహంతో..

Konaseema District: అంబేద్కర్‌ కోనసీమ జిల్లా మండపేట మండలం అర్తమూరు గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.

Konaseema District: కోనసీమ జిల్లాలో ఉద్రిక్తత.. దళిత వృద్ధుడి మృతదేహంతో..
X

Konaseema District: అంబేద్కర్‌ కోనసీమ జిల్లా మండపేట మండలం అర్తమూరు గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామానికి చెందిన ఓ దళిత వృద్ధుడు కన్నుమూశాడు. అయితే.. ఖననం చేసేందుకు జాగా లేదని దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పంచాయతీ ముందు మృతదేహంతో ఆందోళనకు దిగారు. అనంతరం మండపేట - రామచంద్రాపురం రోడ్డుపై బైఠాయించారు. దళితులపై మండల స్థాయి అధికారులు వివక్ష చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులకు శ్మశానవాటిక లేదని.. ఈ అంశంపై జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. అధికారులు అగ్రవర్ణాలకు కొమ్ముకాస్తున్నారని దళిత యువకులు ఆరోపించారు.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES