యంగ్ మ్యాన్‌ అయ్యావు.. టీడీపీ ఎంపీ లేఖ పై మాజీ మంత్రి!

యంగ్ మ్యాన్‌ అయ్యావు..  టీడీపీ ఎంపీ లేఖ పై మాజీ మంత్రి!
పుట్టబోయే బిడ్డను కేర్ చేసేందుకు 9 రోజుల పెటర్నిటీ లీవ్‌కు అనుమతివ్వాలని శ్రీకాకుళం టీడీపీ ఎంపీ రామ్మెహన్ నాయుడు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసిన సంగతి తెలిసిందే.

పుట్టబోయే బిడ్డను కేర్ చేసేందుకు 9 రోజుల పెటర్నిటీ లీవ్‌కు అనుమతివ్వాలని శ్రీకాకుళం టీడీపీ ఎంపీ రామ్మెహన్ నాయుడు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. నిండు గర్భిణి అయిన తన భార్య మరో 10 రోజుల్లో ప్రసవించే అవకాశం ఉందని, ఈ సమయంలో తన భార్య వద్ద ఉండటం అవసరం అని.. కాబట్టి తనకు సెలవులు మంజూరు చేయాలని రామ్మెహన్ నాయుడు ఆ లేఖలో వివరించారు.

జనవరి 29 నుంచి ఫిబ్రవరి 10 వరకు తొమ్మిది రోజులపాటు సెలవు మంజూరు చేయాలని రామ్మోహన్ కోరారు. అయితే ఈ లేఖ పైన మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు స్పందించారు. 'ఫైన్ యంగ్ మ్యాన్‌గా ఎదిగిన నిన్ను చూసి మీ నాన్న ఎక్కడున్నా సంతోషిస్తారు' అని ట్వీట్ చేశారు. కాగా, రామ్మోహన్ నాయుడు 2017 జూన్‌లో మాజీ మంత్రి బండారు సత్యన్నారయణ మూర్తి కూతురు శ్రావ్యను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.


Tags

Read MoreRead Less
Next Story