AP Assembly Sessions : అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ విడుదల

X
By - Manikanta |20 Feb 2025 8:15 PM IST
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 24 నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 25వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉండగా, 28న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈనెల 27వ తేదీన ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ మరుసటి రోజునే బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 8 నెలలు దాటింది. గత ఏడాది జూన్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. జూలైలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టాల్సి ఉండగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో కొంత సమయం తీసుకున్నారు. రెండుసార్లు ఓటాన్ అకౌంటు బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com