దేవాలయాల విషయంలో కేంద్రానికి బాధ్యత లేదా ? : అచ్చెన్నాయుడు

దేవాలయాల విషయంలో కేంద్రానికి బాధ్యత లేదా ? : అచ్చెన్నాయుడు
సీఎం, హోం మినిస్టర్, డీజీపీలు క్రిస్టియన్లుగా ఉన్నారు కాబట్టి.. ఆ ముగ్గురూ మరింత అప్రమత్తం గా వ్యవహరించాల్సి ఉంటుందని చెప్పారు అచ్చెన్నాయుడు.

దేవాలయాల విషయంలో కేంద్రానికి బాధ్యత లేదా అని ప్రశ్నించారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ఇన్ని ఘటనలు జరుగుతుంటే కేంద్రం ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. టీడీపీపై నిందలు వేయడం మాని, దాడుల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలని రాష్ట్ర బీజేపీకి సలహా ఇచ్చారు.

CBIతో విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చాలన్నారు. విజయవాడలో ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం గడ్కరీ ఆదేశాల మేరకే కొన్ని గుళ్లు, మసీదులు తొలగించామని స్పష్టం చేశారు. సీఎం, హోం మినిస్టర్, డీజీపీలు క్రిస్టియన్లుగా ఉన్నారు కాబట్టి.. ఆ ముగ్గురూ మరింత అప్రమత్తం గా వ్యవహరించాల్సి ఉంటుందని చెప్పారు.

మూడు రాజధానుల విషయంలో అబాసుపాలైన సీఎం.. తోక ముడుస్తున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీని సీఎం జగన్ వైసీపీ కార్యాలయంలా మార్చేశారని, టీడీపీని నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ.. కార్యకర్తలు ఎదురొడ్డి పోరాడుతున్నారని అచ్చెన్నాయుడు అన్నారు.


Tags

Read MoreRead Less
Next Story