ఆత్రేయపురం పూతరేకులకు అరుదైన గౌరవం

ఆత్రేయపురం పూతరేకులకు అరుదైన గౌరవం
ఆత్రేయపురం అనగానే వెంటనే గుర్తొచ్చేది పూతరేకులు. అద్భుతమైన ఈ వంటకానికి అరుదైన గౌరవం లభించింది.

ఆత్రేయపురం అనగానే వెంటనే గుర్తొచ్చేది పూతరేకులు. అద్భుతమైన ఈ వంటకానికి అరుదైన గౌరవం లభించింది. ఆత్రేయపురం పూతరేకులకు భౌగోళిక గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వ డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ జియోగ్రాఫికల్‌ ఇండికేషన్స్‌ రిజిస్ట్రీలో పూతరేకులు నమోదయ్యాయి. 400 ఏళ్ల చరిత్ర కలిగిన పూతరేకులు అంతర్జాతీయ గుర్తింపు పొందడం పట్ల ఆత్రేయపురం వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

భౌగోళిక గుర్తింపు కోసం ఆత్రేయపురానికి చెందిన సర్ అర్థర్ కాటన్ పూతరేకుల సహకార సంఘం వైజాగ్ దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ సహాకారంతో భౌగోళిక గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకుంది. దీనిపై స్పందించిన కేంద్ర విభాగం ఫిబ్రవరి 13న విడుదల చేసిన జియోగ్రాఫికల్‌ ఇండికేషన్స్‌ జర్నల్‌లో ఆత్రేయపురం పూతరేకుల గుర్తింపుపై ప్రకటన ఇచ్చింది. అభ్యంతరాల స్వీకరణకు ఇచ్చిన గడువు ఈనెల 13వ తేదీ అర్ధరాత్రితో ముగిసింది. ఇప్పటి వరకు ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో భౌగోళిక గుర్తింపు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం పూతరేకులుకు అరుదైన గౌరవం దక్కడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఆత్రేయపురం వాసులు.

Tags

Read MoreRead Less
Next Story