విజయవాడలో టీడీపీ నేత పట్టాభిపై దాడి!

విజయవాడలో టీడీపీ నేత పట్టాభిపై దాడి!
టీడీపీ నేత పట్టాభిరామ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. విజయవాడలోని ఆయన ఇంటి వద్దే ఈ ఘటన జరిగింది.

టీడీపీ నేత పట్టాభిరామ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. విజయవాడలోని ఆయన ఇంటి వద్దే ఈ ఘటన జరిగింది. ఆఫీసుకు వెళ్లేందుకు పట్టాభి ఇంటి నుంచి బయటకు రాగానే.. అక్కడే పొంచి ఉన్న దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పట్టాభికి గాయాలు కాగా ఆయన కారు ధ్వంసమైంది. 10 మంది దుండగులు ఈ దాడిలో పాల్గొన్నట్లు స్థానికులు చెబుతున్నారు. పట్టాభిపై దాడి జరగటం ఇది రెండోసారి. రెండు నెలల క్రితం కూడా ఆయన వాహనంపై దుండగులు దాడి చేశారు.

Tags

Read MoreRead Less
Next Story