Andhra Pradesh: ఏపీలో దళితులపై ఆగని దాష్టీకాలు

ఏపీలో దళితులపై దాష్టీకాలు ఆగడం లేదు.. తూర్పుగోదావరి జిల్లా కడియంలో ఓ మహిళ అదృశ్యం కేసులో దళితుడిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి.. థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. దళిత యువకుడ్ని విచారణ పేరిట చిత్రహింసలు చేయడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.. ఆ తర్వాత ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఘటన వెలుగులోకి రావడంతో రంగంలోకి దిగిన ఓ మంత్రి.. రాజీ ప్రయత్నాలకు దిగారు..
చాగల్లు మండలం కుంకుడుపల్లికి చెందిన వెంకట దుర్గాప్రసాద్‌ను కడియం పోలీసులు చావబాదారు.. ఓ మహిళ అదృశ్యానికి సహకరించడాన్న అనుమానంతో ...నిజనిజాలు తెలుసుకోకుండా తమ ప్రతాపం చూపించారు.. పోలీసుల దాడిలో బాధితుడికి తీవ్రగాయాలయ్యాయి. దాంతో కడియం పోలీసులపై విపక్షాలు, దళిత నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. అయితే ఓ మంత్రి చేస్తున్న రాజీ ప్రయత్నాలను బాధితులు అంగీకరించడం లేదు.. పోలీసులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
జగన్ ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు ముప్పాళ్ల సుబ్బారావు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. డాక్టర్ సుధాకర్‌ను పిచ్చివాడంటూ ముద్ర వేసి చంపేశారు.. దళితులను హత్య చేసి డోర్ డెలివరీ చేశారు.. మరెంతో మంది దళితులపై దాడులు చేస్తున్నారు.. ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు ముప్పాళ్ల సుబ్బారావు.. తక్షణమే కడియం ఎస్‌ఐ శివాజీపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com