Avanthi Srinivasa Rao: దిగొచ్చిన అవంతి శ్రీనివాస్.. టీవీ5 ప్రతినిధికి క్షమాపణలు..

X
By - Divya Reddy |21 May 2022 9:00 PM IST
Avanthi Srinivasa Rao: రైతు భరోసా కేంద్రంలో రెచ్చిపోయిన ఎట్టకేలకు ఏపీ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ దిగొచ్చారు.
Avanthi Srinivasa Rao: రైతు భరోసా కేంద్రంలో రెచ్చిపోయిన ఎట్టకేలకు ఏపీ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ దిగొచ్చారు. అన్ని వర్గాల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత రావడంతో మా టీవీ-5 ప్రతినిధికి అవంతి క్షమాపణలు చెప్పారు. ఎవరి మనోభాలు దెబ్బ తీయాలని తన ఉద్దేశ్యం కాదన్నారు. ఒకవేళ ఎవరి మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరారు.
ఈనెల 16న విశాఖలోని కొరడా రైతు భరోసా కార్యక్రమంలో అవంతి రెచ్చిపోయారు. భీమిలీ టీవీ-5 రిపోర్టర్‌ను దూషించారు. కవరేజ్‌కు వెళ్లిన రిపోర్టర్‌ను.. పంతులు నీ సంగతి చూస్తానంటూ బెదిరించారు. దీంతో అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలపై బ్రాహ్మణ సంఘాలు పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాయి. టీడీపీ సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా మండిపడ్డాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com