TTD : సనాతన ధర్మంపై కుట్ర.. రామజన్మభూమి ప్రధాన పూజారి

TTD : సనాతన ధర్మంపై కుట్ర.. రామజన్మభూమి ప్రధాన పూజారి
X

తిరుమల ప్రసాదంలో కల్తీ సనాతన ధర్మంపై జరిగిన కుట్రగా అయోధ్య రామజన్మభూమి ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ అభిప్రాయపడ్డారు. దీనిపై ప్రభుత్వం దర్యాప్తు చేసి.. దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు జరిగిన పరిశీలనలో తిరుమల లడ్డూలో చేపనూనె వంటివి కలిపినట్లు తేలిందనీ.. ఇది సనాతన ధర్మంపై జరిగిన కుట్ర, దాడిగా భావిస్తున్నామని ఫైరయ్యారు.

"ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి దర్యాప్తు జరపాలి. దోషులుగా తేలిన వారిపై చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చూడాలి. తిరుపతి బాలాజీ అంటే ప్రజలకు ఎంతో నమ్మకం. ఈ రోజుల్లో ఎక్కడెక్కిడి నుంచో భక్తులు దేవాలయానికి వెళ్లి.. లడ్డూ ప్రసాదం స్వీకరిస్తుంటారు. వారి మనోభావాలు దెబ్బతీసే ఘటన ఇది. ఈ కుట్ర అంతర్జాతీయంగా జరిగిందా.. దేశంలోనే దీనికి బీజం పడిందా అన్నది చూడాలి. దీనిపై దర్యాప్తు కచ్చితంగా జరగాలి...." అని ఆచార్య సత్యేంద్రదాస్ పేర్కొన్నారు.

Tags

Next Story