దేశంలో ఏ రాష్ట్రంలో జరగనంత దోపిడి ఏపీలో జరుగుతోంది: అయ్యన్నపాత్రుడు

దేశంలో ఏ రాష్ట్రంలో జరగనంత దోపిడి ఏపీలో జరుగుతోంది: అయ్యన్నపాత్రుడు
రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరంలో 780 కోట్లు ఆదా చేశామని అసెంబ్లీలో డబ్బా కొట్టిన జగన్‌ రెడ్డి.. ప్రాజెక్ట్ వ్యయంలో 3వేల 222 కోట్లు ఎందుకు పెరిగిందో చెప్పాలని నిలదీశారు.

దేశంలో ఏ రాష్ట్రంలో జరగనంత దోపిడి ఏపీలో జరుగుతోందన్నారు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరంలో 780 కోట్లు ఆదా చేశామని అసెంబ్లీలో డబ్బా కొట్టిన జగన్‌ రెడ్డి.. ప్రాజెక్ట్ వ్యయంలో 3వేల 222 కోట్లు ఎందుకు పెరిగిందో చెప్పాలని నిలదీశారు. పోలవరం కడుతున్న ప్రదేశంలో ఫ్రీగా ఇసుక దొరుకుతుంటే.. మళ్లీ ఇసుక కోసం 500 కోట్లు కేటాయించడం వెనక మతలబు ఏంటో చెప్పాలన్నారు. పట్టిసీమే దండగన్న జగన్.. మరో ఎత్తిపోతలకు 912 కోట్లు ఎందుకు కేటాయించారో సమాధానం చెప్పాలన్నారు అయ్యన్నపాత్రుడు. అలీబాబా 40 దొంగల ముఠా దెబ్బకు రాష్ట్రం ఎలా సర్వనాశనం అవుతోందో ప్రజలు గ్రహించాలన్నారు. ఇసుక, మద్యం, మట్టి, భూములను దోచేస్తున్న దొంగల ముఠా నాయకుడు పోలవరంపైనా కన్నేశారని ఆరోపించారు. అందినకాడికి దోచేస్తున్న జగన్‌ రెడ్డిని ప్రజలు ఇకనైనా నిలదీయకపోతే ఎలా అని ప్రశ్నించారు.

Tags

Read MoreRead Less
Next Story