Badvel By Election: అధికార పార్టీకి 5వ రౌండుకే 52 వేల ఓట్ల మెజారిటీ..

Badvel By Election (tv5news.in)
Badvel By Election: ప్రస్తుతం రాజకీయంలో హాట్ టాపిక్‌గా మారాయి హుజురాబాద్, బద్వేల్ ఉప ఎన్నికలు. తెలంగాణలో హుజురాబాద్, ఆంధ్రప్రదేశ్‌లో బద్వేల్ ఎన్నికలపైనే అందరి దృష్టి ఉంది. చివరికి ఎన్నికలు ముగిసి కౌంటింగ్ తేది కూడా వచ్చేసింది. కౌంటింగ్ మొదలయిపోయింది. బద్వేల్‌లో ఫలితాలు అధికార పార్టీ వైపే మొగ్గుచూపుతున్నాయి.
బద్వేల్ బై పోల్ లో అధికార వైసీపీ హవా స్పష్టంగా కనిపిస్తోంది. రౌండ్ రౌండ్ కు వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధా ఆధిక్యం పెరుగుతోంది. మొత్తం 12 రౌండ్లకు కౌంటింగ్ జరుగుతుండగా 5 రౌండ్లకే ఆమెకు 52 వేలు ఆధిక్యం దాటింది.
తొలి రౌండ్‌లో వైఎస్సార్‌సీపీ 10,478, బీజేపీ 1688, కాంగ్రెస్‌కు 580 ఓట్లు లభించాయి. ఆ తరువాత నుంచి ప్రతి రౌండ్ లోనూ అదే ఆధిక్యం కొనసాగుతూ వస్తోంది. ఇక పోస్టల్ బ్యాలెట్‌లోనూ వైసీపీదే ఆధిక్యం కనిపించింది.
మధ్యాహ్నం 12 గంటలకు తుది ఫలితం వెల్లడయ్యే అవకాశముంది. నియోజకవర్గంలో మొత్తం 2,15,240 ఓట్లు ఉండగా, 1,47,213 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 68.39 శాతం పోలింగ్ నమోదైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com