Balakrishna: టీడీపీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలి: బాలకృష్ణ

X
Balakrishna: తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం NTR పార్టీ పెట్టారన్నారు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు పురస్కరించుకుని గుంటూరులో అన్న ప్రసాదం క్యాంటిన్‌ను ఆయన ప్రారంభించారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు బాలకృష్ణ. ఆఖరుకు మరుగుదొడ్లపై పన్ను వేసే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతి ఒక్కరు పోరాడాలని పిలుపునిచ్చారు బాలకృష్ణ. టీడీపీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
