Andhra Pradesh : అమరావతిలో బసవతారకం క్యాన్సర్ కేర్ క్యాంపస్‌కు బాలయ్య భూమి పూజ

Andhra Pradesh : అమరావతిలో బసవతారకం క్యాన్సర్ కేర్ క్యాంపస్‌కు బాలయ్య భూమి పూజ
X

హైదరాబాద్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ , రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఏపీలో అత్యాధునిక క్యాన్సర్ కేర్ క్యాంపస్ ను ఏర్పాటు చేయనుంది. రాజధాని అమరావతి సమీపంలోని తుళ్లూరు లో ఏర్పాటు చేయనున్న ఈ క్యాంపస్ నిర్మాణానికి ఆ సంస్థ చైర్మన్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భూమి పూజ చేశారు. 21 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఈ క్యాంపస్ లో సమగ్ర క్యాన్సర్ చికిత్స, పరిశోధనతోపాటు.. రోగుల సంరక్షణకు ఎక్స్ లెన్సీ సెంటర్ అందుబాటులోకి తేనున్నారు. తొలి దశలో 500 పడకల సామర్థ్యంతో విస్తృత శ్రేణి ఆంకాలజీ సేవలు అందిస్తారు. రూ.750 కోట్ల పెట్టుబడితో మౌలిక సదుపాయాలు, అధునాతన పరికరాలు సమకూరుస్తారు. 2028 నాటికి శస్త్రచికిత్సలు ప్రారంభించాలని భావిస్తున్నారు. రెండో దశలో పడకల స్థాయి వెయ్యికి పెంచుతారు. ప్రత్యేక విభాగాలు, పరిశోధన విభాగాల ఏర్పాటు, క్లిష్టమైన, అధునాతన క్యాన్సర్ కేసులకు ప్రాంతీయ రెఫరల్ కేంద్రంగా దీనిని తీర్చిదిద్దనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కాగా ఈ భూమిపూజ కార్యక్రమంలో పలువురు మంత్రులతో పాటు, బసవ తారకం ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు.

Tags

Next Story